ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs KXIP, IPL 2020 Live Score: రాణించిన కొహ్లీ.. పంజాబ్ గెలుస్తుందా?

IPL 2020, Royal Challengers Bangalore vs Kings XI Punjab Live Score: చివర్లో క్రిస్ మోరిస్ మెరుపుల(8 బంతుల్లో 25, 3 సిక్స్‌లు, 1 ఫోర్)తో బెంగళూరు ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేదంటే ఇంకా తక్కువ పరుగులకే పరిమితమయ్యేది. ఆఖరి ఓవర్లో మహమ్మద్ షమి బౌలింగ్ 24 పరుగులు వచ్చాయి.

news18-telugu
Updated: October 15, 2020, 9:23 PM IST
RCB vs KXIP, IPL 2020 Live Score: రాణించిన కొహ్లీ.. పంజాబ్ గెలుస్తుందా?
విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ (Image:IPL)
  • Share this:
RCB vs KXIP, IPL 2020: ఐపీఎల్‌లో నేడు 31వ మ్యాచ్ జరుగుతోంది. షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. RCB టీమ్‌లో అద్దిరిపోయే ప్రదర్శన ఎవ్వరూ చేయలేదు. కెప్టెన్ కొహ్లీ 48 పరుగులతో రాణించాడు. క్రిస్ మోరిస్ 25, శివం దుబే 23, అరోన్ ఫించ్ 20 పరుగులతో పరవా లేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కేవలం రన్స్ మాత్రమే చేశాడు. చివర్లో క్రిస్ మోరిస్ మెరుపుల(8 బంతుల్లో 25, 3 సిక్స్‌లు, 1 ఫోర్)తో బెంగళూరు ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేదంటే ఇంకా తక్కువ పరుగులకే పరిమితమయ్యేది.

ఆఖరి ఓవర్లో మహమ్మద్ షమి బౌలింగ్ 24 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి క్రిస్ మోరిస్ ఫోర్ కొట్టాడు. రెెండో బంతికి సింగిల్ తీయగా.. మూడో బంతికి ఉడానా సిక్స్ బాదాడు. నాలుగో బంతికి ఉడానా సింగిల్ తీసి మోరిస్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక ఐదు, ఆరు వరుస బంతుల్లో మోరిస్ సిక్స్‌లు బాదడంతో ఆర్బీసీ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.

ఇక పంజాబ్ బౌలర్లలో షమి 2, మురుగన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌ చెరో వికెట్ తీశారు.

ఈ టోర్నీలో ఇప్పటికే ఓసారి ఇరు జట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 24న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై పంజాబ్ విజయం సాధించింది. ఆ రోజు పంజాబ్ జట్టు 206 స్కోర్ చేసి.. 97 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో పంజాబ్ టీమ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మూడో స్థానంలో ఉంది. పంజాబ్ టీమ్ అట్టడుగున నిలిచింది. కొహ్లీ సేన ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచింది. మరో రెండు ఓడిపోయింది. పంజాబ్ టీమ్ కూడా ఏడు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒకే ఒక్కటి గెలిచింది. అది కూడా బెంగళూరుపైనే విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌లు ఓటమి పాలయింది.
Published by: Shiva Kumar Addula
First published: October 15, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading