కోహ్లీ ఫిజిక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. చొక్కా లేకుండానే కసరత్తులు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ మైంటైన్ చేయడంలో తనకు తనే సాటి. శారీరక దృఢత్వంపై అతనికి అమిత ఆసక్తి ఉంటుంది. టూర్‌ల సమయంలో అందరూ క్రికెటర్లు రెండు గంటలు శ్రమిస్తే, కోహ్లీ మాత్రం నాలుగు గంటల వరకు కసరత్తులు చేస్తాడు.


Updated: August 7, 2020, 3:04 PM IST
కోహ్లీ ఫిజిక్‌కి ఫ్యాన్స్ ఫిదా..  చొక్కా లేకుండానే కసరత్తులు
kohli
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  ఫిట్‌నెస్‌  మైంటైన్ చేయడంలో తనకు తనే సాటి. శారీరక దృఢత్వంపై అతనికి అమిత ఆసక్తి ఉంటుంది. టూర్‌ల సమయంలో అందరూ క్రికెటర్లు రెండు గంటలు శ్రమిస్తే, కోహ్లీ మాత్రం నాలుగు గంటల వరకు కసరత్తులు చేస్తాడు. సాధరణంగా ఆటగాళ్ళ ఫిట్‌‌నెస్ కోసం మాత్రమే కసరత్తలు చేస్తారు. నటులలా సిక్స్ ప్యాక్స్ ట్రై చేసేంతా సమయం వారికి ఉండదు. కానీ కోహ్లీ స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకుని దాన్ని ట్రై చేశారు. ఆయనను చూసి  జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ కూడా సిక్స్ పాక్ పెంచారు.
View this post on Instagram

🤙🏼


A post shared by Virat Kohli (@virat.kohli) on


కరోనా వైరస్ కారణంగా టోర్నీలు లేకపోవడంతో కోహ్లీ ఇంటికే పరిమితమయ్యాడు దీంతో ఖాళీ సమాయాన్ని ఎక్కువగా జీమ్‌లోనే గడుపుతున్నాడు. తన బాడీని మరింత ఫీట్‌గా తయారుచేసుకున్నాడు. తాజాగా ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తున్నా వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశాడు. షట్ లేకుండా పరుగెత్తుతూ బలమైన శారీరక ధృడత్వంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అతని యాబ్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

అలాగే కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో శంకర్‌ బసూదేకు భాగం ఉందని చెప్పాలి.  బసూదే విరాట్  కోహ్లీ, బుమ్రా వంటి క్రికెటర్లను ఫిట్‌నెప్ పాఠలు నేర్పి వారిని ఫిట్‌గా ఉంచడంలో అతని పాత్ర ముఖ్యమైనది చెప్పాలి. ఇక పెప్టెంబర్ నెలలో ప్రారంభమయే ఐపీఎల్ కోసం కోహ్లీ నెట్ ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సారథిగా ఉన్న విరాట్ ఈసారి ఎలాగైనా  టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నారు.
Published by: Rekulapally Saichand
First published: August 7, 2020, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading