ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: టీ20లో టెస్ట్ ఇన్సింగ్స్.. గుర్‌కీరట్ నీకో దండం.. RCB ఫ్యాన్స్ ట్రోలింగ్

మరికొందరు మాత్రం గుర్‌కీరట్‌ను సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆడలేదు..ఇతడి విమర్శిస్తే ఏమొస్తుందని వెనకేసుకొస్తున్నారు.

news18-telugu
Updated: October 31, 2020, 11:14 PM IST
IPL 2020: టీ20లో టెస్ట్ ఇన్సింగ్స్.. గుర్‌కీరట్ నీకో దండం.. RCB ఫ్యాన్స్ ట్రోలింగ్
గురుకీరట్ సింగ్ (Image:IPL)
  • Share this:
IPL 2020: షార్జాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా తక్కువ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. ఫిలిప్పి 32, డివిలియర్స్ 24, వాషింగ్టన్ సుందర్ 21, గుర్‌కీరట్ సింగ్ 15 పరుగులు చేశాడు. ఇందులో గురుకీరట్ చివరి బంతికి ఓవర్‌కు ఆడి నాటౌట్‌గా నిలిచాడు. 24 పరుగుల్లో 15 రన్స్ చేశాడు. ఇందులో 1 ఫోర్ ఉంది. ఐతే టీ20 మ్యాచ్‌లో.. అది కూడా డెత్ ఓవర్లలో.. ఇంత స్లోగా ఆడడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో అతడి బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆఖరి ఓవర్ నటరాజన్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతిని మహమ్మద్ సిరాజ్ ఫేస్ చేశాడు. షాట్ ఆడే ప్రయత్నం చేసినప్పటికీ బ్యాట్ తగల్లేదు. అవతలి వైపు నుంచి గుర్‌కీరట్ సింగ్ రన్ తీశాడు. ఆ తర్వాత రెండు, మూడో బంతిని గుర్‌కీరట్ బీట్ చేశాడు. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఐదో బంతికి సిరాజ్ సింగిల్ తీశాడు. ఆరోబంతికి లెగ్ బైస్ రూపంలో మరో సింగిల్ వచ్చింది. అలా మొత్తం 4 పరుగులే వచ్చాయి. ఐతే సిరాజ్ నుంచి బలవంతంగా స్ట్రైక్ తీసుకొని.. గుర్‌కీరట్ ఆడింది.. ఇదేనా అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వు కూడా కేదార్ జాదవ్‌లా బంతులను తిన్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. టీ20ల్లో టెస్ట్ ఇన్నింగ్స్ అంటూ జోకులు పేల్చుతున్నారు.






మరికొందరు మాత్రం గుర్‌కీరట్‌ను సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆడలేదు..ఇతడి విమర్శిస్తే ఏమొస్తుందని వెనకేసుకొస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. పంజాబ్, కోల్‌కతా, రాజస్థాన్‌కు కూడా 12 పాయింట్లే ఉన్నప్పటికీ.. నెట్‌రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో.. సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి చేరింది. ఇక బెంగళూరు జట్టు 14 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: October 31, 2020, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading