ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: గేల్ రెండు కాళ్లూ కట్టేయాలి.. స్పిన్నర్ అశ్విన్ ట్వీట్ వైరల్

గేల్ షూస్‌కు అశ్విన్ లేస్ కడుతున్న ఫొటోను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అశ్విన్.. నువ్వు నిజంగా జెంటిల్‌మెన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

news18-telugu
Updated: October 21, 2020, 4:03 PM IST
IPL 2020: గేల్ రెండు కాళ్లూ కట్టేయాలి.. స్పిన్నర్ అశ్విన్ ట్వీట్ వైరల్
క్రిస్ గేల్, రవిచంద్రన్ అశ్విన్
  • Share this:
IPL 2020: ఆలస్యంగా పంజాబ్ జట్టులోకి వచ్చిన క్రిస్ గేల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన గేల్..106 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. గత ఆదివారం ముంబై జరిగిన మ్యాచ్‌లో కేకపెట్టించాడు గేల్. రెండో సూపర్ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ కొట్టి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లో 29 పరుగులు చేసి..రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు క్రిస్ గేల్.

మ్యాచ్ అనంతరం.. క్రిస్ గేల్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గ్రౌండ్‌లో క్రిస్ గేల్ షూస్‌కి తాను లేస్ కడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన అశ్విన్.. సరదాగా ఆటపట్టించాడు. 'డెవిల్ ఆల్వేస్ ఇన్ ది డీటెయిల్' అని కామెంట్ చేశాడు అశ్విన్. అంతేకాదు గేల్‌కు బౌలింగ్ వేసేముందు ఇలా రెండు కాళ్లను కట్టేయాలని పేర్కొన్నాడు. ఢిల్లీకి ఇది నిజంగా కష్టమైన రోజు అని.. మళ్లీ పుంజుకుంటామని ట్వీట్‌ చేశాడు అశ్విన్. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


గేల్ షూస్‌కు అశ్విన్ లేస్ కడుతున్న ఫొటోను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అశ్విన్.. నువ్వు నిజంగా జెంటిల్‌మెన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, గేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ జట్టు.. తిరిగి గాడిన పడింది. వరుస ఓటములతో సతమతపడి.. ఇప్పుడు వరుస విజయాలతో ఊపుమీదుంది. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన కేఎల్ రాహుల్ టీమ్.. ఎలాగైన ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. కింగ్స్ ఎలెవన్ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా..4 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఆరింట ఓటమిపాలయింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.

ఇక రవిచంద్రన్ అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఈ సీజన్‌లో అదరగొడుతోంది. ఇతర జట్ల కంటే అత్యధిక మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌లో బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం మూడింట మాత్రమే ఓడిపోయింది.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2020, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading