IPL 2020 LIVE Score, RRvsKXIP: టాస్ గెలిచిన రాజస్థాన్, రెండు మార్పులతో బరిలోకి

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ (Image: IPL/Twitter)

Dream11 IPL 2020 Live Score: IPL 2020లో భాగంగా షార్జాలో జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచింది. రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

  • Share this:
    IPL 2020లో భాగంగా షార్జాలో జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచింది. రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ లెవన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. క్రిస్ గేల్‌ను బరిలోకి దింపడం లేదు. అయితే, రాజస్థాన్ జట్టులో బట్లర్, అంకిత్ రాజ్‌పూత్ బరిలోకి దిగుతున్నారు. యష్ జైస్వాల్, డేవిడ్ మిల్లర్‌కు ప్లేస్ దక్కలేదు. ఆ రకంగా బౌలింగ్‌ను బలోపేతం చేసింది రాజస్థాన్.



    కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు
    కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, పూరన్, ఖాన్, మ్యాక్స్‌వవెల్, నీషమ్, అశ్విన్, కాట్రెల్, షమి, బిష్ణోయ్



    రాజస్థాన్ రాయల్స్ జట్టు
    స్టీవ్ స్మిత్, జాసన్ బట్లర్, సంజూ శాంసన్, ఉతప్ప, పరాగ్, కరన్, తెవాతియా, ఎస్. గోపాల్, ఆర్చర్, రాజ్‌పూత్, ఉనద్కత్



    బౌలింగ్ విషయానికి వస్తే షమీ, కాట్రెల్ వంటి వారితో కింగ్స్ లెవన్ పంజాబ్ పేస్ బలంగా ఉంది. రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్‌తో స్పిన్ కూడా బలంగా ఉంది. వీరిద్దరూ కలసి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు. ఇక రాజస్థాన్ జట్టులో ఆర్చర్ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, జయదేవ్, కరణ్ పరుగులు సమర్పించుకుంటున్నారు. కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 19 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో 10 సార్లు రాజస్థాన్ గెలిచింది. 9 సార్లు పంజాబ్ విజయం సాధించింది. కానీ, గత 4 మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ జట్టు వరుసగా గెలుస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: