ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, RRvsKXIP: రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్‌లో ఎవరు బెస్ట్

Dream11 IPL 2020 Live Score: గత నాలుగు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కెప్టెన్‌గా, కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మంచి జోష్ మీద ఉన్నాడు.

news18-telugu
Updated: September 27, 2020, 5:34 PM IST
IPL 2020 Live Score, RRvsKXIP: రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్‌లో ఎవరు బెస్ట్
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ (Image: IPL/Twitter)
  • Share this:
IPL 2020లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. అటు కింగ్స్ లెవన్ పంజాబ్, ఇటు రాజస్థాన్ రాయల్స్ రెండూ బలంగా ఉన్నాయి. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి దూకుడు మీద ఉన్నాడు. గత నాలుగు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద రాహుల్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కెప్టెన్‌గా, కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మంచి జోష్ మీద ఉన్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. కేఎల్ రాహుల్‌తో పాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇద్దరూ చెలరేగితే పంజాబ్‌ను తట్టుకోవడం రాయల్స్‌కు చాలా కష్టం. వీరితో పాటు మ్యాక్స్‌వెల్ కూడా జట్టులో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు భారీ స్కోర్ చేయకపోయినా తనదైన రోజన మ్యాక్స్‌వెల్‌ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. నికోలస్ పూరన్ కూడా మంచి బ్యాట్స్‌మెన్. వీరిలో కొత్తగా ఎవరు ఫామ్‌లోకి వచ్చినా పంజాబ్ జట్టు మంచి స్కోర్ సాధించడం ఖాయం.



ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే చెన్నైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ సమయోచితంగా ఆడాడు. వికెట్ కీపర్ సంజూ సాంసన్ 32 బంతుల్లో 74 పరుగులతో విజృంభించాడు. ఆఖర్చో ఆర్చర్ కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ ముగ్గురికితోడు ఇప్పుడు బట్లర్ కూడా జట్టులకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బట్లర్ టీమ్‌లోకి వస్తే మిల్లర్‌కు ప్లేస్ దక్కడం అనుమానమే. మొత్తానికి ఈ నలుగురు ప్లేయర్లలో ఇద్దరు బాగా ఆడినా మంచి స్కోర్ సాధిస్తుంది.



బౌలింగ్ విషయానికి వస్తే షమీ, కాట్రెల్ వంటి వారితో కింగ్స్ లెవన్ పంజాబ్ పేస్ బలంగా ఉంది. రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్‌తో స్పిన్ కూడా బలంగా ఉంది. వీరిద్దరూ కలసి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు. ఇక రాజస్థాన్ జట్టులో ఆర్చర్ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, జయదేవ్, కరణ్ పరుగులు సమర్పించుకుంటున్నారు. కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 19 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో 10 సార్లు రాజస్థాన్ గెలిచింది. 9 సార్లు పంజాబ్ విజయం సాధించింది. కానీ, గత 4 మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ జట్టు వరుసగా గెలుస్తోంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading