ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 LIVE Score, RRvsKXIP: రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం, ఐపీఎల్‌లో రికార్డు బ్రేక్

Dream11 IPL 2020 Live Score: రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్ మీద గెలుపొందింది.

news18-telugu
Updated: September 27, 2020, 11:28 PM IST
IPL 2020 LIVE Score, RRvsKXIP: రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం, ఐపీఎల్‌లో రికార్డు బ్రేక్
సంజూ శాంసన్ (Image;IPL/Twitter)
  • Share this:
IPL 2020లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన 9వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు 223 పరుగులు చేసి, 224 రన్స్ టార్గెట్ ఇచ్చినా కూడా దాన్ని విజయవంతంగా ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 224 పరుగులు చేయాల్సి ఉండగా, ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే 226 పరుగులు చేసింది రాజస్థాన్ జట్టు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ ఇదే. నిజంగా క్రికెట్ లవర్స్‌కు అద్భుతమైన కిక్ ఇచ్చిన మ్యాచ్.224 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో ఓవర్లోనే ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. కాట్రెల్ వేసిన బంతిని ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు బట్లర్. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ భారీ షాట్స్ ఆడాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లే (6 ఓవర్లు) పూర్తయ్యే సమయానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 69 పరుగులు చేసింది. అయితే, జట్టు స్కోర్ 100 పరుగులకు చేరిన తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔట్ అయ్యాడు. నీషమ్ వేసిన 9వ ఓవర్‌లో స్మిత్ డీప్ కవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ను మహ్మద్ షమీ అందుకున్నాడు. దీంతో 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేసిన స్మిత్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.


స్టీవ్ స్మిత్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ తివాతియా మొదట చాలా పేలవమైన ఆట ఆడాడు. వాస్తవానికి 10 ఓవర్ల వరకు రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రాజస్థాన్ జట్టు స్కోర్ 104గా ఉంది. అదే 15 ఓవర్లు పూర్తయ్యే సరికి జట్టు స్కోర్ 140కి చేరింది. 15 ఓవర్ తర్వాత సంజూ శాంసన్ స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాడు. 16వ ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టాడు. అయితే, 17వ ఓవర్ ఫస్ట్ బంతికే 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ (42 బంతుల్లో 85, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) వద్ద సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. షమీ వేసిన బంతిని అనవసరంగా టచ్ చేశాడు శాంసన్. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడింది. దీంతో సంజూ శాంసన్ వెనుదిరిగాడు.

సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత రాహుల్ తివాతియా చెలరేగాడు. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టాడు. ఆ ఓవర్లో మొత్తం 30 పరుగులు వచ్చాయి. అయితే, షమీ బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప (9 పరుగులు. 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 4వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తివాతియా (31 బంతుల్లో 53 పరుగులు, 7 సిక్స్‌లు) కూడా షమీ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. ఇక ఆరు బంతుల్లో కేవలం రెండుపరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉన్న సమయంలో 20వ ఓవర్లో రెండో బంతికి పరాగ్ ఔట్ అయ్యాడు. కరణ్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.కింగ్స్ లెవన్ పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్‌ను కేవలం రెండు ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ వైపునకు మ్యాచ్‌ను తిప్పేశాడు తివాతియా. 18వ ఓవర్లో 5 సిక్స్‌లతో 30 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో ఆర్చర్ 2 సిక్స్‌లు, తివాతియా ఒక సిక్స్ కొట్టారు. దీంతో మ్యాచ్ కింగ్స్ లెవన్ చేజారిపోయింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2020, 11:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading