ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, RRvsKXIP: పూరన్ పిచ్చెక్కించే ఫీల్డింగ్, సచిన్ ఫిదా అయిపోయాడు

Pooran Catch: కింగ్స్ లెవన్ పంజాబ్ ప్లేయర్ పూరన్ చేసిన ఫీల్డింగ్ అద్భుతం. దీన్ని చెప్పడం కాదు. చూసి తీరాల్సిందే.

news18-telugu
Updated: September 27, 2020, 10:34 PM IST
IPL 2020 Live Score, RRvsKXIP: పూరన్ పిచ్చెక్కించే ఫీల్డింగ్, సచిన్ ఫిదా అయిపోయాడు
పూరన్ అద్భుతమైన క్యాచ్
  • Share this:
Nicholas Pooran Catch: కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఓ అద్భుతమైన ఫీల్డింగ్ మనం చూసి తీరాల్సిందే. ఈ ఐపీఎల్ సీజన్‌కే ఇది ఒక బెస్ట్ ఫీల్డింగ్‌ అవుతుంది. కింగ్స్ లెవన్ పంజాబ్ ప్లేయర్ పూరన్ చేసిన ఫీల్డింగ్ అద్భుతం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ వేశాడు మురుగన్ అశ్విన్. ఆ సమయంలో సంజూ శాంసన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే కింగ్స్ బౌలర్ల మీద విరుచుకుపడుతున్నాడు. అలాంటి సమయంలో అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు. మొదటి బంతికి సింగల్ తీసి స్ట్రైకింగ్ సంజూ శాంసన్‌కు ఇచ్చాడు కెప్టెన్ స్టీవ్ స్మిత్. అశ్విన్ వేసిన రెండో బంతిని భారీ షాట్ ఆడాడు సంజూ శాంసన్. అయితే, ఆ భారీ షాట్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టాడు పంజాబ్ ఫీల్డర్ పూరన్. అయితే, అది బౌండరీ దాటిన తర్వాత గాల్లో ఆ క్యాచ్ పట్టాడు. ఆ వెంటనే ఆ బంతిని మళ్లీ ఫీల్డ్‌లోకి విసిరేశాడు. ఆ ఫీల్డింగ్‌ను చూడాల్సిందే కానీ, ఎంత వర్ణించినా వేస్ట్.ఆ బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ తర్వాత బాల్‌కే సిక్స్ కొట్టాడు సంజూ శాంసన్. ఆ రకంగా అక్కడ కవర్ చేశాడనుకోవచ్చు. కానీ, ఓ భారీ సిక్స్‌ను పూరన్ సేవ్ చేసిన విధానం మాత్రం క్రికెట్ లవర్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఫీల్డింగ్ చూసి ఫిదా అయిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సచిన్ ఈ ఫీల్డింగ్ గురించి ట్వీట్ చేశాడు. ‘నా జీవితంలో చూసిన అద్భుతమైన సేవ్. సింప్లీ అద్భుతం.’ అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. పూరన్ ఫొటోను పోస్ట్ చేశాడు.


కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు కూడా అతడి ఫీల్డింగ్ చూసి ఫిదా అయిపోయింది. క్రికెట్ ఫీల్డింగ్ దిగ్గజంగా పేరుపొందిన జాంటీ రోడ్స్ గనుక ఈ ఫీల్డింగ్ చూస్తే కచ్చితంగా గర్వపడతాడంటూ కింగ్స్ లెవన్ పంజాబ్ ట్వీట్ చేసింది.ఇక క్రికెట్ లవర్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో పూరన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. జాంటీ రోడ్స్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ ఎలా పొందాలో పూరన్‌ని అడగాలి అంటూ అంతా కింగ్స్ లెవన్ ప్లేయర్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే, క్రికెట్‌లో ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడని సీన్ అంటూ పొగిడాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన ఫీల్డింగ్ అంటూ మరికొందరు నెటిజన్లు ప్రకటించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2020, 10:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading