ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 LIVE Score, RRvsKXIP: మయాంక్ సునామీ - రాహుల్ రచ్చ, పంజాబ్ రికార్డు స్కోర్

Dream11 IPL 2020 Live Score: కింగ్స్ లెవన్ పంజాబ్ రికార్డు స్కోర్ చేసింది. 20 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.

news18-telugu
Updated: September 27, 2020, 9:16 PM IST
IPL 2020 LIVE Score, RRvsKXIP: మయాంక్ సునామీ - రాహుల్ రచ్చ, పంజాబ్ రికార్డు స్కోర్
మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (Image; IPL/Twitter)
  • Share this:
IPL 2020లో భాగంగా షార్జాలో జరుగుతున్న 9వ మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ రికార్డు స్కోర్ చేసింది. 20 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఓ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. కింగ్స్ లెవన్ పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ దుమ్మురేపారు. ముఖ్యంగా మయాంక్ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మయాంక్ అగర్వాల్ 50 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌లో ఏ బౌలర్‌ను కూడా వదిలిపెట్టలేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఈ సీజన్‌లో అత్యధిక ఫస్ట్ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ కలసి ఫస్ట్ వికెట్‌కు 183 రన్స్ చేశారు. చివరకు 17వ ఓవర్లో టామ్ కరణ్ వారిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. కరణ్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి ఫుల్ టాస్ ఆడబోయి శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు మయాంక్. దీంతో 183 పరుగుల వద్ద కింగ్స్ లెవన్ పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది.



రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు వేసిన ప్రతి ఓవర్లోనూ ఫోర్  లేదా సిక్స్ కొట్టేందుకు రాహుల్, మయాంక్ ప్రయత్నించారు. నాలుగో ఓవర్, ఐదో ఓవర్లలో మూడు ఫోర్లు చొప్పున వచ్చాయి. పవర్ ప్లే పూర్తయ్యే సరికి కింగ్స్ లెవన్ పంజాబ్ స్కోర్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 60 రన్స్ చేసింది. 7వ ఓవర్లో మయాంక్ అగర్వాల్ వరుసగా రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు. శ్రేయాస్ గోపాల్ వేసిన 9వ ఓవర్లో సిక్స్ కొట్టడం ద్వారా మయాంక్ అగర్వాల్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిక్స్ కొట్టాడు మయాంక్. అలాగే, 96 పరుగుల వద్ద ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బాల్స్‌లో సెంచరీ కొట్టాడు. 106 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు.ఓ వైపు మయాంక్ రాజస్థాన్ బౌలర్ల భరతం పడుతుంటే, మరోవైపు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా మెల్లమెల్లగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 54 బంతుల్లో 69 రన్స్ (అందులో 7 ఫోర్లు, ఒక సిక్స్) కొట్టిన తర్వాత అంకిత్ రాజ్‌పుత్ వేసిన 18వ ఓవర్లో చివరి బంతికి ఔట్ అయ్యాడు. ధర్డ్ మ్యాన్ బౌండరి దిశగా కేఎల్ రాహుల్ కొట్టిన బంతి గాల్లోకి లేచి శ్రేయాల్ గోపాల్ చేతిలో పడింది.

చివర్లో మ్యాక్స్‌వెల్, పూరన్ కూడా రాజస్థాన్ బౌలర్లను వదిలిపెట్టలేదు. 19వ ఓవర్లో చివరి బంతికి పూరన్ బంతిని గాల్లోకి లేపాడు. అయితే, అద్భుతమైన క్యాచ్‌ను వదిలిపెట్టాడు ఊతప్ప. ఆ తర్వాత పూరన్ రెచ్చిపోయాడు. ఆర్చర్ వేసిన 20వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు పూరన్. పూరన్ ఎంతలా చెలరేగాడంటే కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 3 సిక్స్‌లు ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ కూడా 9 బాల్స్‌లో 13 రన్స్ చేశాడు. దీంతో పంజాబ్ జట్టు 223 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2020, 9:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading