ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: కోహ్లీని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంటాం.. కానీ..

. సోషల్ మీడియాలో అభిమానులతో ఫ్రాంచైజీలు,ఆటగాళ్ళు చాట్ షోలు నిర్వహిస్తున్నారు. షేరు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ అభిమాని రాజస్థాన్ రాయల్స్‌ను కొట్టే ప్రశ్న వేశాడు

Rekulapally Saichand
Updated: August 11, 2020, 1:16 PM IST
IPL 2020: కోహ్లీని రాజస్థాన్ రాయల్స్  జట్టులోకి తీసుకుంటాం.. కానీ..
అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న కోహ్లీ (File)
  • Share this:


ఐపీఎల్ సందడి మెుదలైంది. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడుతూ వచ్చిన ఈ మెగా టోర్నీని యుఏఈ వేదికగా నిర్వహించేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో అడ్డంకి తొలుగుంచుకుంటూ టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ముందుకు వెళుతోంది. త్వరలోనే ఐపీఎల్ టైటిల్‌కు కొత్త స్పాన్సర్‌ రానుంది. ఇక ఆటగాళ్ళ విషయానికి వస్తే వారు ప్రాక్టీస్‌లో మునిగితెలుతున్నారు. ఫ్రాంఛైజీలు ప్లేయర్స్‌ను దుబాయ్ తరలించేందుకు సన్నహాలు కూడా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గెలుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో ఫ్రాంచైజీలు,ఆటగాళ్ళు చాట్ షోలు నిర్వహిస్తున్నారు. అభిప్రాయాలను షేరు చేసుకుంటున్నాయి.

తాజాగా ఓ అభిమాని రాజస్థాన్ రాయల్స్‌ను కొట్టే ప్రశ్న వేశాడు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని మీ జట్టులోకి ఆహ్వానిస్తారా? అని అడిగాడు. దానికి రాయల్స్ ఫ్రాంఛైజీ‌‌ ఓ కండీషన్ పెడుతూ ఒప్పుకుంది. "విరాట్‌ని కచ్చితంగా జట్టులోకి తీసుకుంటాం కానీ అతనితో పాటు మిస్టర్ నాగాస్ వస్తేనే కోహ్లీని ఆహ్వానిస్తాం' అని రాయల్స్ కండీషన్ పెట్టింది. నాగాస్.. బెంగళూర్ జట్టును ప్రమెట్ చేసే వ్యక్తి. డ్రెస్సింగ్ రూములో జరిగే సంబరాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ జట్టు అభిమానులను మరింత దగ్గరయోలా చేస్తాడు.
Published by: Rekulapally Saichand
First published: August 11, 2020, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading