IPL 2020 RAJASTHAN ROYALS FIELDING COACH DISHANT YAGNIK TESTS POSITIVE FOR COVID 19 SA
IPL 2020: ఐపీఎల్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్‌కు షాక్
ప్రతీకాత్మక చిత్రం
IPL 2020 - Rajasthan Royals: ఐపీఎల్ టోర్నీ ముందే రాజాస్థాన్ రాయల్స్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీం ఫీల్డీంగ్ కోచ్ దిశాంత్ యాగ్నీక్కు కరోనా సోకింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం దుబాయ్ వెళ్ళే ఏ టీంకీ అయిన రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్ టోర్నీ ముందే రాజాస్థాన్ రాయల్స్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీం ఫీల్డీంగ్ కోచ్ దిశాంత్ యాగ్నీక్కు కరోనా సోకింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం దుబాయ్ వెళ్ళే ఏ టీంకీ అయిన రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్స్ టీం త్వరలో ఆటగాళ్ళను ముంబైకి తరలించి అక్కడ సమావేశం అనంతరం దుబాయ్ తరిలించే ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో ఆ టీంలోని సభ్యులందరీకి కరోనా టెస్ట్‌లు చేయించింది. ఈ పరీక్షలలో ఫీల్డీంగ్ కోచ్ యాగ్నీక్కు కరోనా పాజిటివ్ అని తెలింది. దీంతో ఆ టీం కొంత ఆందోళనకు గురవుతోంది. ఆయన టచ్‌లో ఉన్న ప్లేయర్స్‌పై కన్నేసింది. ఆటగాళ్లందరకి అదనపు టెస్ట్‌లు చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దమైంది. దిశాంత్‌తో టచ్‌లో ఉన్న ఆటగాళ్లంతా క్వారంటైన్ వెళ్ళి కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని కోరింది.
దిశాంత్ కోచ్ కాకముందు రాజస్థాన్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన అతను రిటైరై రాజస్ధాన్ రాయల్స్ జట్టుకు ఫీల్డీంగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ సోకడంతో ప్రస్తుతం తన స్వస్థలం ఉదయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.