పాంటింగ్‌ వ్యంగ్య వ్యాఖ్యతో తేవటియాలో పెరిగిన కసి

రాహుల్ తేవాటియా(Rahul Tewatia)

రాహుల్‌ తేవటియా.. ఇప్పుడు ఈ యువ సంచలనం పేరు ఐపీఎల్‌లో మారుమోగుతోంది. ఒక్క ఇన్నింగ్స్‌ అతన్ని రాత్రి రాత్రికి సూపర్ స్టార్‌ను చేసింది. ఒక్క ఓవర్లో ఐదు సిక్స్‌లు బాది ఓటమి అంచున ఉన్న రాజస్ధాన్‌ను గెలిపించాడు.

  • Share this:


    రాహుల్‌ తేవటియా.. ఇప్పుడు ఈ యువ సంచలనం పేరు ఐపీఎల్‌లో మారుమోగుతోంది. ఒక్క ఇన్నింగ్స్‌ అతన్ని రాత్రి రాత్రికి సూపర్ స్టార్‌ను చేసింది. ఒక్క ఓవర్లో ఐదు సిక్స్‌లు బాది ఓటమి అంచున ఉన్న రాజస్ధాన్‌ను గెలిపించాడు. రాహుల్‌ ఇలా రాణించడం వెనుకలా చాలా పెద్ద కథే ఉంది. గతేడాది ఐపీఎల్‌‌లో తను ఢిల్లీ క్యాపిటల్స్‌లో సభ్యులుగా ఉన్న సమయంలో ‌వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్‌ రికీ పాంటింగ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రసంగించాడు. అద్భుత పోరాట పటిమను ప్రదర్శించిన పంత్, ఇంగ్రామ్, ధావన్, ఇషాంత్, బౌల్ట్, రబడ పేర్లను ప్రస్తావిస్తూ వారిని అభినందించాడు.

    తన ప్రసంగం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నడుచూకుంటూ వెళ్తున్న పాంటింగ్‌‌కు దగ్గరకు వెళ్ళిన తేవటియా ‘నేనూ నాలుగు క్యాచ్‌లు పట్టాను. నా పేరును కూడా కాస్త చెప్పవచ్చుగా అని అడిగాడు. దీంతో అతను మాటలపై కొంత అసహనం వ్యక్తం చేసిన రికి పాంటింగ్ ఇతను కూడా నాలుగు క్యాచ్‌లు పట్టాడుగా, అందరూ అతన్ని అభినందించండి అంటూ వ్యంగంగా స్పందించాడు. ఈ మాటలు విన్న ఇతర ఆటగాళ్ళు ఒక్కసారిగా నవ్వేశారు. అక్షర్‌ పటేల్‌ అయితే తేవటియాను గట్టిగా మందలించాడు. అడిగి మరీ అభినందనలు ఎవరైనా చెప్పించుకుంటారా’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దానికి ఘాటుగా స్పందించిన రాహుల్ మనకు దక్కాల్సిన గుర్తింపును హక్కుగా భావించి దాని కోసం పోరాడాల్సిందే’ అని జవాబిచ్చాడు. ఆ కసితోనే ఈ ఐపీఎల్‌లో గుర్తించబడే ప్రదర్శనను కనబరిచాడు.
    Published by:Rekulapally Saichand
    First published: