IPL 2020: కామెంటేటర్ల నోట వినపడే లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ అంటే ఏమిటి?

క్రికెట్ పరిచయం ఉన్న ఆట అయినప్పటికి.. ఆ గేమ్ సంబంధించిన టెర్మినాలజీ తికమకపెడుతూ ఉంటుంది. తరుచూగా ఈ ఆటలో వినపడే లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ పదాలు గురించి తెలియక కొంత అయోమయం చెందుతాం.

news18-telugu
Updated: October 22, 2020, 1:21 PM IST
IPL 2020: కామెంటేటర్ల నోట వినపడే లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ అంటే ఏమిటి?
క్రికెట్ పరిచయం ఉన్న ఆట అయినప్పటికి.. ఆ గేమ్ సంబంధించిన టెర్మినాలజీ తికమకపెడుతూ ఉంటుంది. తరుచూగా ఈ ఆటలో వినపడే లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ పదాలు గురించి తెలియక కొంత అయోమయం చెందుతాం.
  • Share this:


క్రికెట్ మన అందరికి సుపరిచితమైన గేమ్.. భారతీయులు అమితంగా ఇష్టపడే ఆట.  అలాంటి క్రికెట్‌ను ఐపీఎల్ మరో స్ధాయికి తీసికెళ్ళింది.    బ్యాటింగ్ మెరుపులు, ఫీల్డింగ్ విన్యాసాలు, బౌలర్ల గుగ్లీలు.. ఇలా ఐపీఎల్ అధ్యంతం ఫ్యాన్స్‌ను అలారిస్తునే ఉంటుంది. క్రికెట్ పరిచయం ఉన్న ఆట అయినప్పటికి.. ఆ గేమ్ సంబంధించిన టెర్మినాలజీ మనల్ని తికమకపెడుతూ ఉంటుంది. తరుచూగా ఈ ఆటలో వినపడే లైన్ అండ్ లెన్త్, చేంజ్ ఆఫ్ పేస్ పదాలు గురించి తెలియక కొంత అయోమయం చెందుతాం. అయితే స్టార్ట్స్ స్పోర్ట్స్ ఛానల్ ప్రేక్షకుల సందేహలను నివృత్తి చేసేందుకు ట్విటర్ వేదికగా #starniaduguలో పేరుతో ఓ క్యాంపైన్ రన్ చేస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు తమ సందేహాలను అడుగుతూ నివృతి చేసుకుంటున్నారు. ఎంపైర్ కాల్,చేంజ్ ఆఫ్ పేస్, లైన్ లెండ్ లెన్త్ అంటే ఏంటంటూ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ను అడుగుతున్నారు. అయితే మనలో కూడా చాలా మందికి అవెంటో తెలియదు కదా! సో మనం ఓసారి వాటి గురించి తెలుసుకుందాం.

చేంజ్ ఆఫ్ పేస్ (change of face): బౌలర్ తన  బంతి వేగంలో మార్చడాన్ని చేంజ్ ఆఫ్ పేస్ అంటారు. ఉదహరణకు ముందు బంతిని గంటకు 110  కిలో మీటర్ల వేగంతో విసిరి  ఆ తర్వాతి బంతిని 130 కిలోమిటర్ల వేగంతో వేయడం. బాట్స్‌మెన్ మూమెంట్‌ను బట్టి వారి అయోమయానికి గురి చేయడానికి ఇలా బంతులను సందిస్తూ ఉంటారు.


లైన్ అండ్ లెన్త్(line and length): ఫీల్డర్స్ పెట్టుకున్న విధంగా బౌల్ చేయడమే లైన్ అండ్ లెన్త్. ఇది ఎక్కువ పవర్ ఫ్లే సమయంలో ఈ అస్త్రాన్ని బౌలర్ వాడుతుంటాడు. బాట్స్‌మెన్ షాట్ అడగానే బాల్ ఫీల్డర్ చేతులోకే వెళ్లాలి. దాన్ని వదిలిస్తే ఎల్బీగా వెనుదిరిగాలి. ఈ ప్లాన్‌తో బౌలర్ లైన్ అండ్ లెన్త్ బాల్స్‌ను సందిస్తుంటారు. ఓ మంచి బౌల‌ర్ పాటించాల్సిన బేసిక్ రూల్ ఇది.

లెన్త్:  బౌలర్ల దగ్గర ఉండే స్టంప్స్‌కు బ్యాట్స్‌మెన్ దగ్గర ఉండే స్టంప్స్‌కు మ‌ద్య 22 యార్డ్స్ దూరం ఉంటుంది. ఈ దూరాన్ని సమాన భాగంగా విభజించి.. స్ట్రైకింగ్ వైపు ఉండే పిచ్‌పై బౌలర్ బాల్స్ వేస్తాడు. ఆ పిచ్‌లో పడే బాల్ ఎలా పడుతుందో తెలుసుకోవాడానికి లెన్త్ ప్రమాణికంగా తీసుకుంటారు. అంటే బాల్ ఎంత ఎత్తు వరకు లేచి డౌన్ అయింది తెలుసుకోవాడమే లెన్త్.

షార్ట్ పిచ్ - స్టంప్స్ నుంచి 8 మీట‌ర్ల వ‌ర‌కు వచ్చే బాల్స్‌ను షార్ట్ పిచ్ బంతులు అంటారు
Published by: Rekulapally Saichand
First published: October 22, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading