IPL 2020 Points Table Update: సోమవారంనాటి ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 10 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఆర్సీబీ పాయింట్ టేబుల్లో మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ సేన..రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి నాలుగు పాయింట్లు పొందింది. నెట్ రన్ రేటు(NRR) -1.450గా ఉంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్(4 పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా...రాజస్థాన్ రాయల్స్(4 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ పరంగా ఈ రెండు జట్లూ ఆర్సీబీ కంటే ముందున్నాయి.
ఇప్పటి వరకు ఆడిన మొత్తం 3 మ్యాచ్‌లలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లలో ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండు పాయింట్లు, ఎన్ఆర్ఆర్ 0.654గా ఉంది. రెండు పాయింట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరు, ఏడో స్థానాల్లో నిలిచాయి. రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చివరి స్థానం(8)లో ఉంది.
Orange Cap(Most Runs)
అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్లకు సంబంధించిన ఆరంజ్ క్యాప్ పట్టికలో కేఎల్ రాహుల్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్‌లో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ మొత్తం 222 పరుగులు సాధించాడు. ఒక్క పరుగు తక్కువ(221)తో మయాంక అగర్వాల్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) రెండో స్థానంలో నిలవగా...సీఎస్కే ఆటగాడు డూప్లెసిస్(173), రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్(159), ఆర్సీబీ ఆటగాడు ఏబీ డీవిల్లియర్స్(134) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Purple Cap(Most Wickets)
అలాగే అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లకు సంబంధించి పర్పుల్ క్యాప్ పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మొహమ్మద్ షమి మొత్తం 7 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబడా(ఢిల్లీ క్యాపిటల్స్) 5 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. శాం కురాన్ (5), ఛాహల్(5) మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తున్నారు.
సోమవారంనాటి మ్యాచ్‌లో ఆర్సీబీపై రెండు వికెట్లు సాధించిన ముంబై ఇండియన్స్ ఫేసర్ ట్రెంట్ బౌల్ట్ ఐదో స్థానానికి ఎగబాకాడు.
ఇక ఐపీఎల్లో జరగనున్న తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి.
అబు దాబిలో ఇవాళ(29 సెప్టెంబర్) ఢిల్లీ క్యాపిటల్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 11వ మ్యాచ్ జరగనుంది.