news18-telugu
Updated: October 8, 2020, 7:28 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా అబుదాబిలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరో ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమిపాలయ్యింది. రాహుల్ త్రిపాఠి(51 బంతుల్లో 81 పరుగులు) చివరి ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు సాధించి ఆలౌట్ కాగా...168 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ విజయంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను వెనక్కినెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్లో 21 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు...నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించగా..రెండు మ్యాచ్‌లలో పరాజయంపాలయ్యింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ 1.488గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లు, 1.060 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లో విజయం సాధించగా...ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది.

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మూడు, నాలుగు స్థానాల్లో నిలవగా...చెన్నై సూపర్ కింగ్స్ 4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చివరి స్థానంలో నిలుస్తోంది.
ఆరంజ్ క్యాప్: కేఎల్ రాహుల్ (KXIP), 302 పరుగులు
పర్పుల్ క్యాప్: రబడా (DC), 12 వికెట్లు
Published by:
Janardhan V
First published:
October 8, 2020, 6:57 AM IST