IPL 2020: ఐపీఎల్ నిర్వహణను సమర్థించిన పాక్ దిగ్గజ ఆటగాడు

IPL 2020 Updates | కరోనా సంక్షోభ సమయంలో బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లతో ఒప్పందాలకు న్యాయం చేయాలంటే లీగ్‌లు నిర్వహించడం తప్పదని పాక్ దిగ్గజ ఆటగాడు జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. డబ్బుల కోసం లీగ్‌లు నిర్వహించే హక్కు బీసీసీఐకి ఉందన్నాడు.

news18-telugu
Updated: August 2, 2020, 7:54 AM IST
IPL 2020: ఐపీఎల్ నిర్వహణను సమర్థించిన పాక్ దిగ్గజ ఆటగాడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీ20 వరల్డ్ కప్ వాయిదాపడటంతో ఐపీఎల్ 2020 టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు జహీర్ అబ్బాస్ సమర్థించాడు. ఈ విషయంలో స్వదేశానికి చెందిన కొందరు ఆటగాళ్లు బీసీసీఐపై చేసిన విమర్శలతో విభేదిస్తూ సానుకూలంగా స్పందించాడు. ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో జరగాల్సిన ఐపీఎల్ 2020తో పాటు ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీలు కోవిడ్ కారణంగా వాయిదాపడ్డాయి. దీంతో సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా ఐపీఎల్ 2020 టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అయితే ఐపీఎల్ కోసమే టీ20 వరల్డ్ కప్ వాయిదావేశారని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, మరికొందరు పాక్ ఆటగాళ్లు ఆరోపించారు. ఆటకు మేలు జరగాలన్న ఆలోచన లేకుండా...డబ్బు సంపాదనే కీలకంగా మారిందంటూ బీసీసీఐపై విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. కోవిడ్-19 కారణంగా నెలకొన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో డబ్బుల కోసం లీగ్ నిర్వహించాల్సిన అవసరం బోర్డులపై ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ నిర్వహించి డబ్బులు ఆర్జించే హక్కు బీసీసీఐకి ఉందన్నాడు. కరోనా సంక్షోభ సమయంలో బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లతో ఒప్పందాలకు న్యాయం చేయాలంటే లీగ్‌లు నిర్వహించడం తప్పదన్నాడు. ఆ విషయానికి వస్తే బీసీసీఐ ఒక్కటే కాదు...పాక్, వెస్టిండీస్ జట్లు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తూ...ఖాళీ స్టేడియాల్లో ఆడుతున్నాయని గుర్తుచేశారు. అలాగే ఖాళీ స్టేడియాల్లో సీపీఎల్‌ను ఆగస్టు మాసం నుంచి నిర్వహించనున్నారని గుర్తుచేశాడు. ప్రస్తుత సంక్షోభ సమయంలో క్రికెట్ దేశాలు డబ్బు సంపాదనపై దృష్టిపెట్టాలని, దీనికి పరస్పరం అన్ని దేశాలు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు.
Published by: Janardhan V
First published: August 2, 2020, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading