ఐపీఎల్ 2020

  • associate partner

వారిద్దరి వల్లే నేనే అలా ఆడాగలుగుతున్నాను: వాట్సన్

ఐపీఎల్–12 ప్రారంభ మ్యాచ్‌లలో కొంత తడబడ్డ వాట్సన్. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 96 పరుగులు చేసిన వాట్సన్ అప్పటివరకు అనగా 11వ మ్యాచ్ వరకు అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు.


Updated: September 10, 2020, 3:37 PM IST
వారిద్దరి వల్లే నేనే అలా ఆడాగలుగుతున్నాను: వాట్సన్
రక్తం కారుతున్న బ్యాటింగ్ చేస్తున్న షేన్ వాట్సన్
  • Share this:
ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఐపీఎల్–13 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. 2019లో జరిగిన ఐపిఎల్ సీజన్–12లో సైతం సిఎస్కె తరఫున ఆడిన వాట్సన్ సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరియు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఐపీఎల్–12 ప్రారంభ మ్యాచ్‌లలో కొంత తడబడ్డ వాట్సన్. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 96 పరుగులు చేసిన వాట్సన్ అప్పటివరకు అనగా 11వ మ్యాచ్ వరకు అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు.ఆ సందర్భంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరియు కోచ్ ఫ్లెమింగ్ ఇచ్చిన సూచనల మేరకు తదుపరి మ్యాచ్‌లలో మంచి పరుగులు తీయగలిగాడు.

నబీల్ హష్మి యూట్యూబ్ షోలో పాల్గొన్న వాట్సన్ సీఎస్కే జట్టు, ఐపీఎల్ సీజన్–13 గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. వాట్సన్ మాట్లాడుతూ ‘‘గత సీజన్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ, జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్టెమింగ్ల నుంచి నాకొచ్చిన సహకారం మర్చిపోలేనిది. గత సీజన్ అరంభంలో నేను గొప్పగా ఆడకపోయినప్పటికీ ధోనీ, ఫ్లెమింగ్ నా ఆటపై నమ్మకముంచి ప్రోత్సహించారు. నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫునే కాకుండా ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పుడు కూడా ధోని మరియు ఫ్లెమింగ్ నా ఆటను మెచ్చుకున్నారు. ప్రపంచ స్థాయి నాయకులు మాత్రమే ఇటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.’’ అని అన్నారు.

"ఇది నాకు గొప్ప అనుభవం, ఎవరైనా మీ సామర్థ్యాన్ని గట్టిగా విశ్వసిస్తే మీ నుంచి ఏదో ఒక సమయంలో మంచి ఫలితాలొస్తాయి”అని వాట్సన్ అన్నారు. "నేను చెన్నైకి వ్యతిరేకంగా రాయల్స్ తరపున ఆడినప్పుడు, స్టీఫెన్ ఫ్లెమింగ్ ,ఎంఎస్ ధోనీలు నన్ను ఎప్పుడూ మెచ్చుకునేవారు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నా కెరీర్లో ఈ భాగాన్ని గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరినీ నమ్మశక్యంగా చూసుకునే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. అని వాట్సన్ అన్నాడు.
Published by: Rekulapally Saichand
First published: September 10, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading