Home /News /ipl /

IPL 2020 OLD TWEET OF SURYAKUMAR CALLING KOHLI GOD RESURFACES SK

IPL 2020: 'విరాట్ కొహ్లీ దేవుడు'.. సూర్యకుమార్ ట్వీట్ వైరల్

విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (Image:Twitter)

విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (Image:Twitter)

IPL 2020: బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్స్‌లు 10 ఫోర్లు ఉన్నాయి.

    IPL 2020: సోషల్ మీడియాలో ఇప్పుడు బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ, ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గురించే చర్చ జరుగుతోంది. గత మ్యాచ్‌లో సూర్యను కొహ్లీ స్లెడ్జింగ్ చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంతో ట్యాలెంట్ ఉన్న సూర్యను కొహ్లీ కావాలనే తొక్కేస్తున్నాడని ట్వీట్ల మోత మోగిస్తున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్లే ప్రతిభావంతులకు జట్టులో చోటు దక్కడం లేదని ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి నలుగురు ప్లేయర్లను ఎంపిక చేశారని, కానీ సూర్య కుమార్ యాదవ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని మండిపడుతున్నారు.

    మరోవైపు ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్‌ను కొహ్లీ స్లెడ్జింగ్ చేయడంపై దుమారం రేగుతోంది. ఒక యంగ్ ప్లేయర్‌ పట్ల కెప్టెన్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాగేనా వ్యహరించేదని మాజీ క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ మ్యాచ్‌లో 13వ ఓవర్‌ పూర్తయ్యాక సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు చూస్తూ విరాట్ కొహ్లీ ముందుకెళ్లాడు. సూర్య కూడా అలాగే చూశాడు. సూర్య వెనకకు వెళ్లిన కొహ్లీ.. బంతిని రుద్దుతూ సూర్యకుమార్ వైపు కోపంగా చూశాడు. కొహ్లీ స్లెడ్జింగ్ చేసినా అతడు పట్టించుకోలేదు. అక్కడి నుంచి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    దీనిపై రచ్చ జరుగుతున్న వేళ సూర్యకుమార్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. 2016 మార్చిలో కొహ్లీని ఉద్దేశించి సూర్యకుమార్ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒత్తిడి ఎక్కడ ఉంటే అక్కడ కొహ్లీ ఉంటాడని.. కొహ్లీని చూస్తుంటే మూడో స్థానంలో దేవుడే బ్యాటింగ్‌కు వెళ్తున్నట్లు అనిపిస్తుందని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొహ్లీని సూర్యకుమార్ దేవుడిలా చూస్తుంటే.. కొహ్లీ మాత్రం సూర్యను తొక్కేస్తున్నాడని మండిపడుతున్నారు.


    కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్స్‌లు 10 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించింది ముంబై ఇండియన్స్. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం.. సూర్యకుమార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సూర్య ఇన్నింగ్స్.. బీసీసీఐకి చెప్పుదెబ్బ లాంటిందని.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    సూర్యకుమార్ ఇన్నింగ్స్‌పై టీమిండియా కోచ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ''సూర్యనమస్కారాలు. బలంగా ఉండు. ఓపికతో ఉండు.'' అని ట్వీట్ చేశారు.

    త్వరలోనే సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియాలో చూస్తామని ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్..362 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Mumbai Indians

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు