ఐపీఎల్ 2020

  • associate partner

Rohit Sharma: రోహిత్ శర్మ ఎక్కడ.. హిట్‌మ్యాన్‌కు అసలేమైంది?

ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడింటింలో ఓటమి పాలయింది.

news18-telugu
Updated: October 25, 2020, 9:26 PM IST
Rohit Sharma: రోహిత్ శర్మ ఎక్కడ.. హిట్‌మ్యాన్‌కు అసలేమైంది?
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 15 కోట్లు
  • Share this:
IPL 2020: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌కూ దూరమయ్యాడు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ నుంచి తప్పుకున్న హిట్‌మ్యాన్.. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌‌లో కూడా ఆడలేదు. అతడి స్థానంలో వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ తాత్కాలిక కెప్టెన్సీ‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు హిట్‌మ్యాన్‌కు ఏమైందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన రెండు సూపర్ల మ్యాచ్‌లో ఓటమి తర్వాత రోహిత్‌ శర్మ మళ్లీ కనిపించలేదు. ఐతే రోహిత్‌ శర్మ ఆరోగ్యం బాగోలేదని ఆ తర్వాత పొలార్డ్ వెల్లడించాడు. రోహిత్‌ శర్మ పోరాట యోధుడని.. తప్పకుండా తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపాడు పొలార్డ్. ఈ నేపథ్యంలో అసలు రోహిత్‌కు ఏమైందని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ అంశంపై ముంబై ఇండియన్స్ జట్టు స్పష్టతనిచ్చింది. రోహిత్ శర్మ కొన్ని రోజులుగా తొడ గాయంతో బాధపడుతున్నాడు. తొడ నరం పట్టేసి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ కోలుకున్నాడని.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని అక్టోబరు 23న తెలిపింది.


ఐతే ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కూ రోహిత్ దూరమవడంతో.. అతడిని పెద్ద గాయం ఏమైనా అయిందన్న సందేమాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి మ్యాచ్‌లోనైనా ఆడతాడా? లేడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు రోహిత్ శర్మ ఆరోగ్యంపై క్వింటన్ డికాక్ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళం సృష్టించాయి. రోహిత్ జట్టులోకి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదని.. కానీ అతడు కోలుకుంటున్నాడని చెప్పాడు.

కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడింటింలో ఓటమి పాలయింది. 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 4 మాత్రమే గెలిచింది. మరో ఏడింటిలో ఓడిపోయింది. 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది.
Published by: Shiva Kumar Addula
First published: October 25, 2020, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading