ఐపీఎల్ 2020

  • associate partner

MI vs CSK, IPL 2020: షార్జాలో రోహిత్ వర్సెస్ ధోనీ.. పంతం నీదా? నాదా?

MI vs CSK, IPL 2020: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ముంబై టీమ్ 17 సార్లు గెలవగా.. చెన్నై జట్టు 12 సార్లు విజయం సాధించింది.

news18-telugu
Updated: October 23, 2020, 5:50 PM IST
MI vs CSK, IPL 2020: షార్జాలో రోహిత్ వర్సెస్ ధోనీ.. పంతం నీదా? నాదా?
రోహిత్ వర్సెస్ ఎంఎస్ ధోనీ
  • Share this:
IPL 2020: ఐపీఎల్ 2022 టోర్నీలో 41వ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడునున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ధోనీ సేనను రోహిత్‌సేన ఢీకొట్టబోతోంది. ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరువలో ఉండగా.. ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే చెన్నైకిది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లదు. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌‌లు ఆడిన రోహిత్ శర్మ టీమ్..ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక 10 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన.. కేవలం మూడు మ్యాచ్‌లు గెలిచి చివరి స్థానలోంది.

ముఖాముఖి రికార్డు: (29 matches- MI 17 | CSK 12)

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ముంబై టీమ్ 17 సార్లు గెలవగా.. చెన్నై జట్టు 12 సార్లు విజయం సాధించింది.

గత ఐదు ముఖాముఖి మ్యాచ్‌లు: (5 matches- MI 4 | CSK 1)

చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది.

ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో గెలిచింది.

ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ముంబై ఇండియన్స్ 46 రన్స్ తేడాతో విజయం

ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో గెలుపు



ఈ సీజన్‌లో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు తలపడ్డాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని చెన్నై జట్టు ఓడించింది. 5 వికెట్ల తేడాతో ధోనీ సేన విజయం సాధించింది. ఇక 2019 ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నైని ఓడించి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.

ఇతర రికార్డులు:


అత్యధిక స్ట్రైక్ రేట్:


ముంబై  ఇండియన్స్:  కీరన్ పొలార్డ్: 165.6

అత్యధిక వ్యక్తిగత స్కోరు:


ముంబై ఇండియన్స్: మైక్ హస్సీ (86*)

చెన్నై సూపర్ కింగ్స్:  సనత్ జయసూర్య (114*)

ఎక్కువ వికెట్లు:

ముంబై ఇండియన్స్ :  లసిత్ మలింగ  (31)

ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన:

ముంబై ఇండియన్స్:  హర్భజన్ సింగ్ (5/18 in 4 overs)

చెన్నై సూపర్ కింగ్స్: మోహిత్ శర్మ (4/14 in 4 overs)

అత్యధిక ఇనింగ్స్ స్కోర్:

ముంబై ఇండియన్స్: 202/7,  202/5

చెన్నై సూపర్ కింగ్స్: 208/ 5
Published by: Shiva Kumar Addula
First published: October 23, 2020, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading