ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs MI, IPL 2020: అబుదాబిలో ముంబై వర్సెస్ బెంగళూరు.. గెలిస్తే ఫ్లేఆఫ్స్‌కి..

RCB vs MI, IPL 2020: ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, ముంబై జట్లు 26సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది.

news18-telugu
Updated: October 28, 2020, 4:45 PM IST
RCB vs MI, IPL 2020: అబుదాబిలో ముంబై వర్సెస్ బెంగళూరు.. గెలిస్తే ఫ్లేఆఫ్స్‌కి..
పొలార్డ్, కొహ్లీ (Image:IPL)
  • Share this:
RCB vs MI, IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో కాసేపట్లో 48వ మ్యాచ్ జరగబోతోంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవడంతో ఈ మ్యాచ్‌కు కూడా పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన ఉన్న జట్లు పోటీపడుతుండడంతో.. ఈమ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది. ఇరు జట్లలో భారీ హిట్టర్‌లు ఉండడంతో.. పరుగుల వరద పారవచ్చు. గత మ్యాచ్‌లో ఇరుజట్లు వేర్వేరుగా ఓడిపోవడంతో.. ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు సిద్ధం చేశాయి.

ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, ముంబై జట్లు 26సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు జట్లు ఓసారి తలపడ్డాయి. సెప్టెంబరు 28న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై, బెంగళూరు జట్లు 201 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్లో కొహ్లీ సేన గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. ముంబై ఇండియన్స్‌ను మరోసారి ఓడించి..పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టుదలతో ఉంది.




అబుదాబిలో పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. మొన్నటి వరకు బౌలర్లకు సహకరించిన పిచ్‌లపై ఇప్పుడు బ్యాట్స్‌మెన్ విరుచుకుపడుతున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా అదే ఎక్కువ స్కోర్ నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో భారీ షాట్స్ కొట్టే హిట్టర్స్ ఉండడంతో.. భారీగా పరుగుల వరద పారే అవకాశముంది.


ఐపీఎల్ 2020 టోర్నీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడాయి. చెరో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మరో నాలుగింటిలో ఓడిపోయింది. ఇరు జట్లు 14 పాయింట్లు సాధించాయి. ఐతే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్నందున ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు జట్టు రెండో స్థానంలో నిలిచింది.
Published by: Shiva Kumar Addula
First published: October 28, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading