ఐపీఎల్ 2020 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) అదరగొడుతోంది. ఇటు భీకర బ్యాటింగ్.. అటు బుల్లెట్ బౌలింగ్‌తో.. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తూ.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఐతే ఆ మ్యాచ్‌లో ఓ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేడియంలో వీవీఐపీ గ్యాలరీలో కూర్చొని ముంబై జట్టును ఎంకరేజ్ చేశారు. ముఖానికి మాస్క్ ధరించి.. పుస్తకాన్ని చదువుతూ.. ఆమె దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రేయర్ ఆంటీ మళ్లీ వచ్చేసింది అంటూ ట్వీట్ల మోత మోగిస్తున్నారు నెటిజన్లు. ఆమె వస్తే ఇక ముంబై జట్టే మ్యాచ్ గెలుస్తుంది. ఢిల్లీ జాగ్రత్త అంటూ గురువారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వారు అన్నట్లుగానే ఢిల్లీపై ముంబై జట్టు ఘన విజయం సాధించింది.
గతంలో 2017లోనూ ఇలాగే ప్రార్థనలు చేస్తూ స్టేడియంలో ఆమె సందడి చేశారు. ముంబై ఇండియన్స్, పూణె సూపర్‌జెయింట్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె తొలిసారి కనిపించారు. పుణె విజయానికి 5 బంతుల్లో 7 పరుగులు అవసరమైన సమయంలో... ఆమె మ్యాచ్ చూడకుండా కళ్లు మూసుకున్నారు. చేతులో జోడించి.. మనసులో దేవుడి ప్రార్థించారు. చివరకు ఆ మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి.. టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మ్యాచ్ గెలుపు కోసం ప్రార్థన చేసిన ఆమెను నెటిజన్లు ప్రశంసించారు. అప్పటి నుంచీ ప్రేయర్ ఆంటీ అని పిలుస్తున్నారు.
ఎవరీ ప్రేయర్ ఆంటీ..?
అసలు ముంబై ఇండియన్స్ కోసం ప్రార్థన చేసిన ఆ మహిళ ఎవరంటూ సోషల్ మీడియాలో ఎంతో మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐతే ఆమె గురించి పూర్తి వివరాలను బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ 2017లోనే ట్వీట్ చేశారు. ముంబై ఇండియన్న ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ తల్లే.. ఈ ప్రేయర్ ఆంటీ. రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్త. ఆమె పేరు పూర్ణిమా దలాల్.
ORANGE CAP:
PURPLE CAP:
ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ పూర్ణిమా దలాల్ కనిపించడంతో.. ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఖచ్చితంగా హాజరవుతారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఆమె రీఎంట్రీతో ముంబైకి అంతా శుభమే జరుగుతుందని.. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ జట్టే కప్పును గెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:November 06, 2020, 17:10 IST