Home /News /ipl /

IPL 2020 MUMBAI INDIANS FANS WANTS ROHIT SHARMA TO GET BACK TO TEAM SK

Rohit Sharma: రోహిత్ శర్మ రావాలంటూ.. టీవీకి హారతి.. వైరల్ వీడియో

రోహిత్ శర్మ (Image:IPL)

రోహిత్ శర్మ (Image:IPL)

Rohit Sharma: రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్‌కు వస్తాడని చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ చేశారు. ఒకరైతే టీవీకి హారతిస్తూ.. రోహిత్ శర్మ రాక కోసం ప్రార్థనలు చేశారు.

    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబై ఇండియన్స్ టీమ్ అదరగొడుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది డిఫెండింగ్ చాంపియన్. ఐతే గత మూడు మ్యాచ్‌లుగా రోహిత్ శర్మ జట్టులో లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొడ కండరం గాయం కారణంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తాత్కాలిక కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడు కెప్టెన్సీ చేపట్టిన మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ రెండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ పొలార్డే కెప్టెన్‌గా ఉన్నాడు.

    ఐతే రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్‌కు వస్తాడని చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ చేశారు. ఒకరైతే టీవీకి హారతిస్తూ.. రోహిత్ శర్మ రాక కోసం ప్రార్థనలు చేశారు. కానీ ఇవాళ కూడా టీమ్‌లోకి రాలేదు హిట్ మ్యాన్.






    కాగా, నవంబరు ఆఖరులో ఆస్ట్రేలియాతో జరగనున్న టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియాను ఎంపిక చేశారు. అందులో రోహిత్ శర్మకు చోటు లభించలేదు. గాయం కారణంగా అతడిని జట్లులోకి తీసుకోలేదు. దీనిపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌కు అంత పెద్ద గాయం అయిందా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ పెద్ద గాయం ఐతే ఇండియాకు వెళ్లి నేషనల్ క్రికెట్ అకాడమీలో ఎందుకు చికిత్స తీసుకోవడం లేదని అడుగుతున్నారు. చిన్న గాయమే అయితే.. వచ్చే నెలాఖరు వరకు తగ్గుతుంది కదా.. మరెందుకు టీమ్‌లోకి తీసుకోలేదని బీసీసీఐని నిలదీస్తున్నారు.
    POINTS TABLE:

    ORANGE CAP:

    PURPLE CAP:
    ప్రస్తుతం రోహిత్ శర్మ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. టీమ్‌లో కెప్టెన్ కొహ్లీకి, రోహిత్ శర్మ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని.. ఈ క్రమంలోనే అతడిని ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయలేదని అభిమానులు మండిపడుతున్నారు. కాగా, రోహిత్ శర్మ నేత‌ృత్వం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి.. 8 గెలిచింది. మరో నాలుగింట ఓటమి పాలయింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న మొదటి జట్టు ముంబై జట్టే కావడం విశేషం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Mumbai Indians, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు