IPL

  • associate partner

IPL 2020 | MS Dhoni కోవిడ్ టెస్ట్ ఫలితం ఏమొచ్చిందో తెలుసా?

IPL 2020 - MS Dhoni | ఐపీఎల్‌ టోర్నీకి సన్నద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ(MS Dhoni) ఇవాళ ఉదయం కోవిడ్ పరీక్ష చేయించుకోవడం తెలిసిందే.

news18-telugu
Updated: August 13, 2020, 9:40 PM IST
IPL 2020 | MS Dhoni కోవిడ్ టెస్ట్ ఫలితం ఏమొచ్చిందో తెలుసా?
ఎంఎస్ ధోనీ (Image:IPL)
  • Share this:
ఐపీఎల్ 2020‌ టోర్నీకి సన్నద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఇవాళ ఉదయం కోవిడ్ పరీక్ష చేయించుకోవడం తెలిసిందే. రాంచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు...ధోనీ ఫాంహౌస్‌కు వచ్చి స్వాబ్ శ్యాంపిల్ సేకరించారు. ధోనీ కోవిడ్ పరీక్షకు సంబంధించిన ఫలితాన్ని ఈ సాయంత్రం ఇచ్చారు. కోవిడ్ పరీక్షలో ధోనీకి నెగటివ్ వచ్చింది. దీంతో చెన్నైలోని శిక్షాణా శిబిరానికి ధోనీ శుక్రవారం బయలుదేరనున్నారు. ఎం.ఎస్.ధోనీకి కోవిడ్ నెగటివ్ రిపోర్టు రావడంతో ఆయన అభిమానులు, సీఎస్కే ఫ్యాన్‌ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ధోనీకి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. #MSDhoni హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. 2019 క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత ధోనీ పోటీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.



ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ ట్వీట్స్ చేశారు. ధోనీలానే ఓ బాలిక రాకెట్ షాట్స్ కొడుతున్న వీడియోను ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.



ఆగస్టు 15 నుంచి 20 మధ్య సీఎస్కే ఆటగాళ్లకు ప్రత్యేక ఫిట్‌నెస్ క్యాంపు నిర్వహించనున్నారు. అక్కడి నుంచే ఈ నెల 21న ఐపీఎల్ టోర్నీ కోసం యూఏఈకి బయలుదేరి వెళ్లనున్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్ టోర్నీ సెప్టెంబర్ 19న ప్రారంభంకానుంది.
Published by: Janardhan V
First published: August 13, 2020, 9:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading