ఐపీఎల్ 2020

  • associate partner

MS Dhoni: ధోని ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాడా?.. అలా చేయడంతో మొదలైన ఊహగానాలు

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ధోని ఐపీఎల్ ‌లో కొనసాగుతుండటంతో.. ఇలాగైనా ధోని ఆటను చూడొచ్చని అభిమానులు సంబరపడ్డారు.

news18-telugu
Updated: October 24, 2020, 12:05 PM IST
MS Dhoni: ధోని ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాడా?.. అలా చేయడంతో మొదలైన ఊహగానాలు
ఎంఎస్ ధోని
  • Share this:
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అతని అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ధోని ఐపీఎల్ ‌లో కొనసాగుతుండటంతో.. ఇలాగైనా ధోని ఆటను చూడొచ్చని అభిమానులు సంబరపడ్డారు. అయితే తాజాగా ధోని.. సైన్ చేసిన తన జెర్సీలను పలువురు ఆటగాళ్లకు అందజేయం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన సీఎస్‌కే N0.7 జెర్సీని బట్లర్‌కు అందజేశాడు. ఇక, తాజాగా తన జెర్సీని పాండ్యా బ్రదర్స్‌(కృనాల్, హార్ధిక్)కు అందజేశాడు.

Fans Speculate Rumours, IPL 2020, MS Dhoni, IS MS Dhoni Retiring from IPL Too, Chennai Super Kings, చెన్నై సూపర్ కింగ్స్, సోషల్ మీడియాలో చర్చ, ఎంఎస్ ధోని, ఐపీఎల్ 2020
ధోని జెర్సీతో పాండ్యా బ్రదర్స్, బట్లర్


ధోని ఇలా చేయడంపై అభిమానులు సోషల్ మీడియాలో  పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఏదో తేడా కొడుతుందని కొందరు ఫ్యాన్స్ ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే ధోని ఆడే చివరి ఐపీఎల్ ఇదేనని కూడా పలువురు నెటిజన్లు అంటున్నారు. మైదానంలో ధోని చూడటం ఇదే చివరిసారి అని కూడా కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నారా అనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఇక, ఈ సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. గతానికి భిన్నమైన ఆట తీరుతో అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. పాయింట్ల టేబుల్స్‌లో టాప్-4లో నిలిచే చెన్నై జట్టు.. ఈ సీజన్‌లో చివరి స్థానాలకు పరిమితమైంది. రైనా, హర్భజన్ టీమ్‌కు దూరమవ్వడం, బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం.. చైన్నై ఓటమికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇంకా, ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లలో చెన్నై ఆడాల్సి ఉంది. దీంతో ఈ సీజన్‌లో చెన్నైకి ప్లే ఆఫ్ చాన్సెస్ లేనట్టుగానే తెలుస్తోంది.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading