Home /News /ipl /

IPL 2020 MS DHONI BEGINS PREPARATION FOR IPL IN RANCHI SA

IPL: వచ్చే నెలలో ఐపీఎల్ పండుగ.. హెలికాప్టర్ షాట్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

ఎంఎస్ ధోనీ (Image:IPL)

ఎంఎస్ ధోనీ (Image:IPL)

టీమిండియా మాజీ సారథి ఎమ్‌ఎస్ ధోనీ మళ్ళి బ్యాట్ పట్టారడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ ఐసీఎల్ కోసం సన్నద్దమవుతున్నాడు.

టీమిండియా మాజీ సారథి ఎమ్‌ఎస్ ధోనీ మళ్ళి బ్యాట్ పట్టాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీ ఐసీఎల్ కోసం సన్నద్దమవుతున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగునున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్ళు ప్రాక్టిస్ మెుదలుపెట్టారు. అన్ని టీంల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. రైనా ఢిల్లీలో సాధన చేస్తుండగా, అలాగే ధోనీ తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు.

ఇప్పుడు అందరి కళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టె్న్‌పైనే ఉన్నాయి. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని రైనా చేప్పిన ఒకరోజు తర్వాత మహీ సాధన మెుదలుపెట్టాడం విశేషం. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌లో ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైన మహీ ఐపీఎల్‌తో రీఎంట్రి ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. యుఏఈ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తిరిగి అంతార్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు.

ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడు ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది. ఐపీఎల్ 2020 టైటిల్ కూడా గెలవాలిని చెన్నై జట్టు అశిస్తోంది. అందరి కంటే ముందు దుబాయ్‌కి చేరుకొవాలని యాల్లో జట్టు సిద్దమవుతంది. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో ఆటగాళ్ళను తరలించాలని చెన్నై
ప్రాంఛైజీ ప్లాన్ చేస్తోంది. మరో నెల రోజుల్లో ఐపీఎల్ పండుగ ప్రారంభం కానుంది.
Published by:Rekulapally Saichand
First published:

Tags: Bcci, IPL, Ms dhoni, UAE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు