ఐపీఎల్ 2020

 • associate partner
  Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  IPL 2020 Updates: 2020 సంవత్సరపు బెస్ట్ గిఫ్ట్ ఐపీఎల్..సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  IPL 2020 MI vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టోర్నీ మరోసారి క్రికెట్‌లోని మజాను ఫ్యాన్స్‌కు రుచిచూపించింది. ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం రాత్రి జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

  news18-telugu
  Updated: September 29, 2020, 8:35 AM IST
  IPL 2020 Updates: 2020 సంవత్సరపు బెస్ట్ గిఫ్ట్ ఐపీఎల్..సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  (Photo: IPL/Twitter)
  • Share this:
  IPL 2020 Latest Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టోర్నీ మరోసారి క్రికెట్‌లోని మజాను ఫ్యాన్స్‌కు రుచిచూపించింది. ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం రాత్రి జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఏడు పరుగులు సాధించగా...కోహ్లీ సేన విజయలక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీ సాధించింది. ముంబై ఇండియన్స్‌కు ఇక ఓటమి ఖాయమనుకున్న తరుణంలో చివరి 5 ఓవర్లలో 90 పరుగులు సాధించిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్లు టై‌గా ముగించారు. అయితే సూపర్ ఓవర్‌లో మాత్రం బెంగుళూరు పైచేయి సాధించడంతో ముంబై ఓటమిని అంగీకరించకతప్పలేదు. మ్యాచ్ టైగా ముగియడం ఓ ఎత్తైతే...సూపర్ ఓవర్‌లోనూ చివరి బంతి వరకు జయోపజయాలు రెండు జట్ల మధ్య దోబూచలాడాయి. ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలడం ఇది రెండోసారి.

  కాగా సోమవారంనాటి థ్రిల్లింగ్ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 సంవత్సరపు బెస్ట్ గిఫ్ట్ ఐపీఎల్ అంటూ వీరూ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ కామెంట్‌తో ఏకీభవిస్తున్నట్లు ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సెహ్వాగ్ ట్వీట్‌ను షేర్ చేసింది.
  మయాంక్ ఏమన్నాడంటే..

  అటు ముంబై-బెంగళూరు మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌పై స్పందించిన క్రికెటర్ మయాంక్ అగర్వాల్...ప్రపంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్‌గా పేర్కొన్నాడు.

  సూపర్ ఓవర్‌లో విజయం తర్వాత కోహ్లీ ఆనందోత్సాహం  అటు నెటిజన్స్ కూడా బెంగళూరు-ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ స్థాయిని పెంచేసిందంటూ కామెంట్ చేశారు.
  Published by: Janardhan V
  First published: September 29, 2020, 8:35 AM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading