MI vs KKR, IPL 2020 Live Score: కోల్‌కతా లో స్కోర్.. కుమ్మేసిన కమ్మిన్స్

కోల్‌కతా లో స్కోర్.. కుమ్మేసిన కమ్మిన్స్

IPL 2020, Mumbai Indians vs Kolkata Knight Riders Live Score: కోల్‌కతా స్కోర్ 140 పరుగులైనా చేస్తుందా అనుకున్న వేళ.. చివరి ఓవర్లో ఇద్దరూ విరుచుకుపడ్డారు. కమ్మిన్స్ ఫోర్ కొడితే.. కెప్టెన్ మోర్గాన్ రెండు సిక్స్‌లు బాదాడు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ టోర్నీలో నేడు 32వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలోనే షేక్ జాయెద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది. కమ్మిన్స్ 53 రన్స్‌తో అదరగొట్టాడు. కెప్టెన్ మోర్గాన్ 31 పరుగులతో బాధ్యాతాయుత ఇన్సింగ్స్ ఆడాడు. శుభమాన్ గిల్ 21 రన్స్ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా స్కోర్ చేయలేదు. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయింది. త్రిపాఠి 7, నితీష్ రానా 5, దినేష్ కార్తీక్ 4 పరుగులే చేశారు. కేకేఆర్ టీమ్ ముందు నుంచీ వరుసగా వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కమ్మిన్స్ జోడి అద్భుతంగా ఆడి.. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి 87 పరుగులు చేశారు. కమ్మిన్స్ కుమ్మేయడంతో కోల్‌కతా ఆ మాత్రమైనా స్కోర్ చేసింది. లేదంటే ఇంకా తక్కువ పరుగులకే పరిమితమయ్యేది.

    ఐతే కోల్‌కతా స్కోర్ 140 పరుగులైనా చేస్తుందా అనుకున్న వేళ.. చివరి ఓవర్లో ఇద్దరూ విరుచుకుపడ్డారు. కమ్మిన్స్ ఫోర్ కొడితే.. కెప్టెన్ మోర్గాన్ రెండు సిక్స్‌లు బాదాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. బోల్ట్, కౌంటర్ నైల్, బుమ్రా తలో వికెట్ సాధించారు.

    ఈ మ్యాచ్ నుంచీ కోల్‌కతాకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో కెప్టెన్సీ నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకున్నాడు. టోర్నీలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా జట్లు తలపడడం ఇది రెండోసారి. సెప్టెంబరు 23న జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా, ముంబై ఇండియన్స్ జట్లు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పటి వరకు కోల్‌కతా జట్టు ఆరింటిలో మాత్రమే గెలిచింది. ముంబై టీమ్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.


    కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ టీమ్.. 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 3 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు చేతిలో ఓడిపోగా.. హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై, పంజాబ్ జట్లపై విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన..5 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో రెండింట ఓటమి పాలయింది.
    Published by:Shiva Kumar Addula
    First published: