IPL 2020: MI vs KKR: కేకేఆర్‌కు ఘన స్వాగతం.. బుర్జ్‌ఖలీఫాపై నైట్ రైడర్స్ లోగో


Updated: September 23, 2020, 8:27 PM IST
IPL 2020: MI vs KKR: కేకేఆర్‌కు ఘన స్వాగతం.. బుర్జ్‌ఖలీఫాపై నైట్ రైడర్స్ లోగో
  • Share this:


IPL 2020 సీజన్‌లో భాగంగా ఐదవ మ్యాచ్ బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగుతుంది. ఈ టోర్నమెంట్‌లో కోల్‌కతా తొలి మ్యాచ్ ఆడుతోంది. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. ఈ బిగ్ పైట్‌లో గెలుపు కోసం రెండు టీంలు స్టార్ ఆటగాళ్ళతో బరిలోకి దిగాయి. అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగుతుంది.




ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభాన్ని ఇవ్వాలని కోల్‌కత్తా భావిస్తుంటే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి మళ్ళీ విజయాల బాట పట్టాలని ముంబై భావిస్తోంది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సమవుజ్జీలుగా ఉన్న ఈ ఇరు జట్లు నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ ప‌డనున్నాయి. అలాగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.
POINTS TABLE:

దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కోల్‌కతా ఐపీఎల్ 2020 ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ఆడతుంది. ఈ సందర్భంగా కేకేఆర్‌కు అరుదైన స్వాగతం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ఖలీఫా ఎల్‌ఈడీ లైట్లతో కోల్‌కతాకు ఘన స్వాగతం పలికింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ లోగోతో బుర్జ్‌ఖలీఫా ధగధగలాడింది. పర్పుల్‌, గోల్డ్‌ రంగుల లోగోతో పాటు ఆటగాళ్ల ఫొటోలను కూడా భవనంపై ప్రదర్శించారు.
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading