HOME »NEWS » »ipl 2020 mi vs dc will trent boult play in the final rohit sharma gives injury update sa

IPL 2020: ముంబై కీలక బౌలర్‌కు గాయం.. ఫ్యాన్య్‌లో టెన్షన్

IPL 2020: ముంబై కీలక బౌలర్‌కు గాయం.. ఫ్యాన్య్‌లో టెన్షన్
ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ ముంగిట ముంబై ఇండియన్స్‌ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ గాయపడం ముంబైని కలవరానికి గురిచేస్తుంది. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతను ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.

  • Share this:

    గత గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ తొడ కండరాలకి గాయమైంది. దీంతో మధ్యలోనే అతను మైదానాన్ని వీడాడు. బోల్ట్ ఆడుతాడా? లేదా? అని అనుమానాలు నెలకొన్న వేళ అతని గాయానికి సంబంధించి రోహిత్ శర్మ అప్‌డేట్ ఇచ్చాడు.

    "ట్రెంట్ బౌల్ట్ ఫిట్‌గానే ఉన్నాడు. ప్రాక్టీస్‌లో మునిగితెలుతున్నాడు. అతని ఆత్మ విశ్వాసం చూస్తుంటే గాయం నుంచి అతను పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఫైనల్లో అతను తుది జట్టు ఉంటాడని ఆశిస్తున్నానని" రోహిత్ తెలిపారు

    బోల్ట్ ముంబై ఇండియన్స్‌లో కీలక బౌలర్‌గా ఉన్నాడు. క్వాలిఫయర్ 1లో ఢిల్లీతో జరిగిన మ్యా్చ్‌లో ఆ జట్టు పతనాన్ని శాసించాడు.  కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 9 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు. ఇక ఐపీఎల్‌లో బౌల్ట్ ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడి 19.40 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. పర్‌ఫుల్ క్యాప్ లిస్ట్‌లో రబడ,బూమ్రా తర్వాత 22 వికెట్లతో బౌల్ట్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

    మంగళవారం ఢిల్లీ,ముంబై జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు నాలుగు సార్లు (2013, 2015, 2017, 2019) చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ మళ్లీ గెలిస్తే వారి ఖాతాలో ఐదో టైటిల్‌ చేరుతుంది. ఇక ఢిల్లీ టైటిల్ గెలవాలనే ఆశతో ఉంది. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్‌ 2 లో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది.
    Published by:Rekulapally Saichand
    First published:November 10, 2020, 07:17 IST

    टॉप स्टोरीज