క్యాలిఫయర్-1 మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఢిల్లీని ముంబై చిత్తు చేసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది, ఈ ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌ను నిలవరించడం అంతా సులువుకాదన్నారు. ప్రతీ రాత్రి మనది కాదన్నారు. జట్టు ఓడినప్పటికి నెగటీవ్‌గా మాట్లాడలేనని తెలిపాడు.
" ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగానే ఉంది. అయినప్పటికి జట్టు గురించి నెగటీవ్‌గా మాట్లాడలేను.. లోటుపాట్లును సరిచేసుకుని తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించడానికి సిద్దంగా ఉంటాం. మ్యాచ్‌లో చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమవడంతోనే ఓటిమి చెందాం. ఆరంభంలో కొంత పై చేయి సాధించనప్పటికి.. 13, 14 ఓవర్లలో వరకు ముంబై 110 పరుగులే చేసింది. ఆ ఆటతీరుతోనే ముంబైని కట్టడి చేస్తే..ఆ జట్టు 170 పరుగులకు పరిమితమయేది. అలాంటి పరిస్థితి ఉంటే మాకు గెలిచే అవకాశం ఉండేది. ఇలాంటివి అన్ని ఆటలో చాలా సహజం. అయితే సమయాలన్ని మనకు అనుకూలంగా ఉండవు. బయో బబుల్ లాంటి వాతావరణంలో ఉండటం అంత సులువు కాదు. పాజిటివ్ మైండ్‌తోనే బరిలోకి దిగాం. ప్రాక్టీస్ సెషన్లో కూడా చాలా కష్టపడ్డాం. ఇక అశ్విన్ బౌలింగ్‌లో మెరుగైనా ప్రదర్శనను కనబరిచాడు. కావాల్సిన సమయంలో వికెట్లు తీస్తూ టీంకు అండగా నిలుస్తున్నాడు. ఇక ముంబై బ్యాటింగ్ లైనఫ్ అద్భుతంగా రాణిస్తోంది. లోయరార్డ్‌లో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ విజృంభణ కారణంగా ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలుగుతుంది. అలాంటి జట్టును అడ్డుకోవడం అంత సులువైన విషయం కాద'ని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. సూర్య, ఇషాన్, డికాక్, హార్దిక్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించారు. ఇక 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్ దెబ్బతీశారు. 0 పరుగులకే 3 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 57 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్.
Published by:Rekulapally Saichand
First published:November 06, 2020, 10:20 IST