HOME »NEWS » »ipl 2020 mi vs dc rohit sharma s wonderful gesture for rahul chahar after the youngster had a roug sa

అందుకే కదా రోహిత్‌ను బెస్ట్ కెప్టెన్ అనేది.. ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తోంది!

అందుకే కదా రోహిత్‌ను బెస్ట్ కెప్టెన్ అనేది.. ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తోంది!
Indian skipper

ఐపీఎల్ 2020 సీజన్‌ క్యాలిఫయర్-1 ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 57 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.

  • Share this:


    ఐపీఎల్ 2020 సీజన్‌ క్యాలిఫయర్-1 ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 57 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ముంబై సారథి రోహిత్.. సూపర్ ప్లా్న్‌తో ఢిల్లీని బోల్తా కొట్టించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా కెప్టెన్సీలో సూపర్ హిట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా రోహిత్ తన సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బౌలర్స్ కావాల్సిన సమయంలో ప్రయోగిస్తూ ప్రత్యర్థి బాట్స్‌మెన్‌ను కుప్పకూల్చాడు.







    రోహిత్ ప్రోత్సహంతో రెచ్చిపోయిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ళు ఢిల్లీ దారుణంగా దెబ్బతీశాడు.  రోహిత్ సారథిగా ఎంతటి ప్రభావితం చేస్తాడో తెలపడానికి తాజా ఓ వీడియో ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముంబై స్పీన్నర్ రాహుల్ చాహర్ ఐపీఎల్ 2020లో అద్భుతంగా రాణించాడు.అనుకున్న సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయాలలో
    కీలక పాత్ర పోషించాడు. అయితే గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ విఫలమయ్యాడు. మార్కస్ స్టోయినిస్ అతని బౌలింగ్‌ను చితక్కొట్టాడు.  చాహర్ వేపిన 9వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత వేసిన 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు సమర్పించుకున్నాడు. మిగితా బౌలర్స్ అద్భుతంగా రాణిస్తే చాహర్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

    ఇక ఫీల్డింగ్‌లోనూ చాహర్ రాణించలేదు. క్యాచ్‌లు పట్టడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ నర్వస్‌గా కనిపించాడు. నాలుగు సార్లు బంతిని చేజార్చాడు. చివరకు అక్షర్‌ పటేల్ క్యాచ్ పట్టి కొంత ఊపిరిపీల్చుకున్నాడు.చాహర్ పరిస్థితిని గమనించిన రోహిత్ అతన్ని పోత్సాహించే ప్రయత్నం చేశాడు. రాహుల్ చాహర్ విఫలమైనా రోహిత్ అతనికి గౌరవమిచ్చాడు. ఢిల్లీపై ముంబై ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఆటగాళ్ళు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళి క్రమంలో చాహార్‌కు అనుకొని విధంగా గౌరవం ఇచ్చాడు. జట్టు సభ్యుల కంటే రాహుల్ చాహర్‌ను ముందుండి నడవాలని సూచించాడు. ‘నువ్వు వైఫల్యం చెందిన మేమంతా నీ వెంట ఉంటాం" అనే భరోసాను ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
    Published by:Rekulapally Saichand
    First published:November 06, 2020, 11:28 IST

    टॉप स्टोरीज