HOME »NEWS » »ipl 2020 mi vs dc qualifier 1 live cricket score mumbai indians vs delhi capitals trolling on rohit sharma as he duck out sk

MI vs DC: వచ్చాడు.. వెళ్లాడు.. రోహిత్ శర్మ డకౌట్‌పై జోకులే జోకులు

MI vs DC: వచ్చాడు.. వెళ్లాడు.. రోహిత్ శర్మ డకౌట్‌పై జోకులే జోకులు
రోహిత్ శర్మ (Image:IPL)

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

  • Share this:
    MI vs DC Qualifier 1, IPL 2020: తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. ఐతే లీగ్ దశ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు రోహిత్. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇవాళ దుబాయ్‌లో జరుగుతున్న క్వాలిఫైయర్-1లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు హిట్ మ్యాన్. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటై..గోల్డెన్ డక్‌గా వెను తిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్యూ రూపంలో వికెట్ల ముందు దొరికిపోయాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ..బ్యాటింగ్‌లో విఫలమవుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌లోనూ సింగిల్ డిజిట‌్‌కే పరిమితమ్యాడు.

    కీలమైన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ కావడంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతున్నారు నెటిజన్లు. రోహిత్ శర్మ గాయాల వల్ల కాదు.. ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అందుకే అతడిని ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయలేదని కామెంట్స్ పెడుతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైందని సెటైర్లు వేస్తున్నారు.








    ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 80. స్ట్రైక్ రేట్ 130.8. ఐతే గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తర్వాత.. అతడు బ్యాటింగ్‌లో విఫలమవుతుండడంతో.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:November 05, 2020, 20:14 IST

    टॉप स्टोरीज