HOME »NEWS » »ipl 2020 mi vs dc krunal pandya loses his cool over his brother hardik pandya sa

IPL 2020: ముంబై విజయాల కోసం ఆ సోదరుల పాత్ర ఎంత గొప్పదో తెలుసా?

IPL 2020: ముంబై విజయాల కోసం ఆ సోదరుల  పాత్ర ఎంత గొప్పదో తెలుసా?
ముంబై విజయాల కోసం ఆ సోదరుల చేసే ప్రయత్నం ఎంత గొప్పదో అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తు్న్నారు.

ముంబై విజయాల కోసం ఆ సోదరుల చేసే ప్రయత్నం ఎంత గొప్పదో అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తు్న్నారు.

  • Share this:


    ఆదివారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అనుహ్య సంఘటన చోటుచేసుకుంది. హార్దిక్ పాండ్యాపై అతని సోదరుడు కృనాల్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హర్థిక్ పాండ్యా వేసిన ఓ త్రో విషయంలో తమ్ముడిపై కృనాల్ పాండ్యా కోప్పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







    కృనాల్ పాండ్యా వేసిన ఏడో ఓవర్లలో ఐదో బంతిని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కవర్స్‌లో కొట్టి సింగిల్ తీశాడు.  అక్కడే ఉన్న హర్థిక్ పాండ్యా చాలా బలంగా నాన్ స్ట్రైక్ ఎండింగ్ వైపు త్రో విసిరాడు. ఎంత బలంగా త్రో వేశాడంటే దానికి వేగానికి కృనాల్ కూడా ఆ బంతిని ఆపలేకపోయాడు. దీంతో బాట్స్‌మెన్స్ మరో రన్ తీశారు. దీంతో గుస్స అయిన కునాల్.. హర్థిక్‌పై కోపడ్డాడు. అలా త్రో వేయాల్సిన అవసరం ఏముందంటూ క్లాస్ పీకాడు. ముంబై విజయాల కోసం ఆ సోదరుల చేసే ప్రయత్నం ఎంత గొప్పదో అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తు్న్నారు.
    SCHEDULE TIME TABLE:

    ORANGE CAP:

    PURPLE CAP:

    ఆన్న ఆగ్రహాన్ని గ్రహించిన తమ్ముడు వివరణ ఇచ్చాడు. బ్యాక్‌లో ఫీల్డర్ ఉన్నాడనే ఉద్దేశంతోనే త్రో వేశానని బదులిచ్చాడు. అయిన వినిపించుకోకుండా తమ్ముడిని ఓ మాట అనేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్‌ సేన మరో విజయాన్ని నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (52 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు. ఆ తర్వాత చేధనకు దిగిన ముంబై 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి మరో విజయానికి తన ఖాతలో వేసుకుంది. ముంబై ఇండియన్స్ బాట్స్‌మెన్స్‌లో క్వింటన్‌ డికాక్‌ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
    Published by:Rekulapally Saichand
    First published:October 12, 2020, 20:25 IST

    टॉप स्टोरीज