IPL 2020: ఆ తప్పిందాలే ఢిల్లీ ఓటమికి కారణమయ్యాయి

శిఖర్ ధావన్

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2020లో వరుస విజయాలతో దూసుకెళుతోంది.ఆదివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది.

  • Share this:


    డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2020లో వరుస విజయాలతో దూసుకెళుతోంది.ఆదివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. క్వింటన్‌ డికాక్ ‌(53: 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్ ‌(53: 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌) సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించారు. ఢిల్లీ నిర్థేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేధించింది.

    అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి మూడు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఛేధన దిగిన ముంబైని పవర్ ‌ఫ్లేలో.. అడ్డుకోవడంలో ఢిల్లీ బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా వికెట్ల ధీరుడు కగిసో రబాడా స్ట్రైక్ బౌలర్‌ను పవర్ ఫ్లేలో సమయంలో రబాడాను ఒకే ఒక్క ఓవర్ వేయించాడు. ఆ ఓవర్లను అన్రిచ్ నోర్జ్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్‌లతో మాత్రం పూర్తి చేయించాడు. పవర్ ఫ్లే సమయంలో రబాడాతో మరో ఓవర్ వేయించి ఉంటే రోహిత్ శర్మతో పాటు మరో బాట్స్‌మెన్ ఔటై ఉంటే ముంబైపై ఒత్తిడి పెరిగేది.

    POINTS TABLE:

    SCHEDULE TIME TABLE:

    ORANGE CAP:

    PURPLE CAP:

    అలాగే ఫీల్డింగ్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా తప్పిందాలు చేసింది. అజింక్య రహానే రనౌట్ మిస్‌తో పాటు పృథ్వీ షా,ఆర్ అశ్విన్ క్యాచులు వదిలేయడం కూడా ఆ జట్టు ఓటమికి దారి తీసింది. అలాగే ఢిల్లీ చాలా మిస్ ఫీల్డింగ్‌లు చేసింది. ఈ కారణంగా ముంబైకి 20 పరుగులు అదనంగా వచ్చాయి. ఆ పరుగులు రాకుండా ఉండి ఉంటే ఢిల్లీ విజయం సాధించే అవకాశం ఉండేది. బాట్స్‌మెన్స్ మధ్య సమన్వయం లోపించింది. శిఖర్ ధావన్‌ కారణంగా మార్కస్ స్టోయినిస్ రనౌటైపోయాడు. ఫామ్‌లో ఉన్న అతను  అనుహ్యంగా ఔట్ కావడం ఢిల్లీ.. ముంబైకి భారీ టార్గెట్‌ను నిర్ధేశించడంలో విఫలమైంది.
    First published: