ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, MI vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

Dream11 IPL 2020 Live Update: ఇండియన్స్ ,  చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో ధోనీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

news18-telugu
Updated: September 19, 2020, 7:30 PM IST
IPL 2020 Live Score, MI vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ImageIPL/Twitter))
  • Share this:
ఐపీఎల్ 2020 సీజన్ 13 శుభారంభమైంది. తొలి మ్యాచ్ టాస్ పడింది. ముంబై ఇండియన్స్ ,  చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో ధోనీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది. కరోనా కారణం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫ్యాన్స్ లేకుండా ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ముంబై జట్టులో అందరి దృష్టి కెప్టెన్ రోహిత్ శర్మ మీద ఉంది. అ జట్టు ఆటగాళ్లు అందరి దృష్టి హిట్ మ్యాన్ మీద కేంద్రీకృతమైంది. మరోవైపు అసలు ఐపీఎల్ చూసేవారి అందరి కళ్లు మహేంద్ర సింగ్ ధోనీ మీద ఉన్నాయి. 2019లో వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ఇప్పటి వరకు ధోనీ బ్యాట్ పట్టలేదు. ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పాడు. దీంతో ధోనీ ఆట ఎలా ఉంటుంది. తలైవాలో మునపడి ఆటగాడు ఉన్నాడా? లేడా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. టాస్ గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడుతూ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి బౌలింగ్ ఎంచుకుంటున్నట్ల తెలిపాడు. విదేశీ ఆటగాళ్లలో డూప్లెసిస్, సామ్ కరన్, లుంగి ఎంగిడి, షేన్ వాట్సన్ తుది జట్టులోకి తీసుకున్నామన్నాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తొలి 6 రోజుల క్వారంటైన్ చాలా కష్టంగా గడిచిందని, ప్రాక్టీస్‌కు కల్పించిన వసతులు బాగున్నాయని చెప్పాడు.



అటు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఇటు రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ రెండూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడగా ముంబై 17 సార్లు, చెన్నై 11 సార్లు గెలిచింది.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జేమ్స్ పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.చెనై సూపర్ కింగ్స్: మురళి విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 19, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading