ఐపీఎల్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి సక్సెస్ అయింది. ఆల్‌రౌండర్ మార్కుస్ స్టోయినిస్‌ను ఓపెనింగ్‌లో వచ్చి అదరగొట్టాడు. ధాటిగా ఆడుతూ పవర్ ప్లేలో పరుగుల వరద పారించాడు. ఢిల్లీ క్యాపిట్స్‌కు మంచి స్టార్ట్ అందించాడు. పవర్ ప్లేలో భారీ స్కోర్ (65/0) చేయడంతో.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గింది. ఢిల్లీకి అత్యధిక పవర్ ప్లే స్కోర్ ఇదే కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు స్టోయినిస్. ఆ ఫార్ములా వర్కవుట్ కావడంతో ఫైనల్ మ్యాచ్‌లోనూ అప్లై చేసింది ఢిల్లీ టీమ్. మళ్లీ స్టోయినిస్‌ను ఓపెనింగ్‌కు పంపించింది.
ఫైనల్లోనూ అద్భుతం చేస్తాడనుకున్న స్టోయినిస్.. ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికే ఔట్ అయ్యాడు. బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. బంతి స్టోయినిస్ బ్యాట్‌ను తాకుతూ.. వికెట్ల వెనక ఉన్న కీపర్ డికాక్ చేతిలో పడింది. అలా క్యాచ్ అవుట్ రూపంలో.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు స్టోయినిస్.
క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో స్టోయినిస్ దూకుడును చూసి.. ఫైనల్లోనూ అదరగొడతాడని ఎంతో మంది అభిమానులు భావించారు. గౌతం గంభీర్ కూడా తన డ్రీమ్ 11 కెప్టెన్ స్టోయినిస్ అని ట్వీట్ చేయడంతో.. చాలా మంది అతడిని ఫాలో అయ్యారు. డ్రీమ్ 11 యాప్‌లో తమ జట్టుకు కెప్టెన్, వైఎస్ కెప్టెన్‌గా ఎంచుకొని.. పందెం కాశారు. స్టోయినిస్ భారీ స్కోర్ చేస్తే.. తమకు ఎక్కువ పాయింట్లు వచ్చి డబ్బును గెలవచ్చని ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. స్టోయినిస్ డకౌట్ కావడంతో అతడిని నమ్ముకున్న వారంతా నష్టపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ట్వీటర్లో జోరుగా చర్చ జరుగుతోంది.
స్టోయినిస్ డకౌట్ కావడంతో.. చాలా మంది నెటిజన్లు గౌతం గంభీర్‌పై మండిపడుతున్నారు. నిన్న నమ్మే.. మేం స్టోయినిస్‌ను కెప్టెన్/వైఎస్ కెప్టెన్ చేశామని విమర్శిస్తున్నారు. ఐతే గంభీర్ చెప్పాడని.. గుడ్డిగా ఎందుకు ఫాలో అయ్యారని.. మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ్టి మ్యాచ్‌తో కలిపి 17 మ్యాచ్‌ల్లో ఆడాడు మార్కుస్ స్టోయినిస్. 25.14 సగటుతో 352 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 148.52గా ఉంది. అత్యధిక స్కోర్ 65. ఐతే ఫైనల్లో అద్భుతంగా రాణించి జట్టును గెలిపిస్తాడనుకుంటే.. తొలి బంతికే డకౌట్ అయ్యి.. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులను నిరాశపరిచాడు స్టోయినిస్.