news18-telugu
Updated: November 10, 2020, 10:32 PM IST
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో మోహన్ లాల్ (Image:Twitter)
IPL 2020 Final, MI vs DC: దుబాయ్ వేదికగా ఐపీఎల్ టైటిల్ సమరం జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి.. 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 65*, రిషభ్ పంత్ 56 పరుగులు చేశారు. అనంతర బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. లక్ష్యాన్ని చేధనలో దూసుకెళ్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఐతే ఈ మ్యాచ్‌లో మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ సందడి చేశారు. స్టేడియంలో కనిపించి ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను స్టేడియంలో కూర్చొని వీక్షించారు మోహన్ లాల్. ఆయనతో ఫొటోలు దిగేందుకు అక్కడున్న సిబ్బంది పోటీ పడ్డారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫైనల్‌కు మరింత కలరింగ్ తీసుకొచ్చాడంటూ నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు ట్రెంట్ బౌల్ట్. తొలి ఓవర్ తొలి బాల్కే డేంజరస్ మార్కుస్ స్టోయినిస్‌ను ఔట్ చేేశాడు. మూడో ఓవర్లో రహానేను కూడా ఔట్ చేసి..ఢిల్లీ క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టాడు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 10, 2020, 10:29 PM IST