హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020 Live Score, SRH vs KXIP: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ .. తుది జట్టు ఇదే!

IPL 2020 Live Score, SRH vs KXIP: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ .. తుది జట్టు ఇదే!

KXIP VS SRH

KXIP VS SRH

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఆరో స్థానంలో ఉండగా,చివరి స్థానంలో పంజాబ్‌ ఉంది. హైదరాబాద్‌, పంజాబ్‌ ఇప్పటి వరకూ 14సార్లు తలపడగా... అందులో ఎస్‌ఆర్‌హెచ్ 10 మ్యాచ్‌లు గెలవగా పంజాబ్‌ నాలుగింట్లో గెలుపొందింది. ఈ ఐపీఎల్ 2020లో రెండు జట్లు ఐదు మ్యాచుల్లో తలపడగా మూడింట్లో హైదరాబాద్‌, రెండింట్లో పంజాబ్‌ గెలిచాయి.

    తుది జట్టు

    హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్ ‌(C), జానీ బెయిర్‌స్టో(WC), మనీశ్‌ పాండే, కేన్ విలియమ్సన్‌, ప్రియం గార్గ్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, రశీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌,  ఖలీల్ అహ్మాద్.

    పంజాబ్‌: కేఎల్‌ రాహుల్ ‌(C,WC), క్రిస్ గేల్, మయాంక్‌ అగర్వాల్‌, మన్‌దీప్ ‌సింగ్‌, నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మురుగన్‌ అశ్విన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌, రవి బిష్ణోయ్, మహమ్మద్‌ షమీ, షెల్డన్ కాట్రెల్‌/విల్జోయిన్.

    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Dubai, IPL 2020, Kings XI Punjab, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు