హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020 Live Score, SRH vs KXIP: సన్‌రైజర్స్‌ మెరిసింది.. పంజాబ్‌పై ఘనవిజయం

IPL 2020 Live Score, SRH vs KXIP: సన్‌రైజర్స్‌ మెరిసింది.. పంజాబ్‌పై ఘనవిజయం

దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎజరగుతున్న మ్యాచ్‌లో  సన్‌రైజర్స్  69 పరుగులతో ఘన విజయం  సాధిచింది.

దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎజరగుతున్న మ్యాచ్‌లో  సన్‌రైజర్స్  69 పరుగులతో ఘన విజయం  సాధిచింది.

దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎజరగుతున్న మ్యాచ్‌లో  సన్‌రైజర్స్  69 పరుగులతో ఘన విజయం  సాధిచింది.

  దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్  69 పరుగులతో ఘన విజయం  సాధిచింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 202 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ చేధించలేకపోయింది. ఆరంభంలో నే ఆ  జట్టు తడబడింది. రెండో ఓవర్లలోనే పంజాబ్‌ తొలి వికెట్‌ చేజార్చుకుంది. 1.3వ బంతికి రెండో పరుగు తీస్తూ డేవిడ్ వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌కు.. మయాంక్‌ (9; 6 బంతుల్లో 1×4) రనౌట్‌ అయ్యాడు. 4 ఓవర్లలో పంజాబ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్‌ బౌలింగ్‌లో సిమ్రన్‌ సింగ్‌ (11; 8 బంతుల్లో 2×4) ప్రియమ్‌ గార్గ్‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదుకుంటాడు అనుకున్న కేల్ రాహుల్‌ను  అభిషక్ శర్మ బోల్తా కొట్టి్చ్చాడు.


  ఓ వైపు వికెట్లు పడుతున్న నికోలస్‌ పూరన్‌(77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు)‌ దాటిగా ఆడాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ బౌలింగ్ గాడి తప్పింది. అబ్దుల్‌ సమద్‌ ఒక్క ఓవర్ల 28 పరుగులు ఇచ్చాడు.అతను‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టాడు పూరన్ .  ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని కూడా నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ  బౌలర్లు పుంజుకోవడంతో  సంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయి  132పరుగులకు అలౌటైంది. దీంతో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నికోలస్‌ పూరన్ ‌(77: 37 బంతుల్లో 5ఫోర్లు, 7సిక్సర్లు) భీకరమైన బ్యాటింగ్ భయపెట్టినా.. రషీద్ ఖాన్ అతన్ని ఔట్ చేసి సన్‌రైజర్స్ గెలుపును ఖాయం చేశాడు.సన్‌ ‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ తలో రెండు వికెట్లు సాధించారు. అభిషేక్‌ శర్మకు వికెట్ దక్కింది.

  POINTS TABLE:

  అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ఓపెనర్స్ దుమ్ములేపారు. వార్నర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించగా, మరో ఓపెనర్ బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) కాస్తలో సెంచరీ మిస్‌య్యాడు. ఓపెనర్లు దాటిగా ఆడి పరుగుల వరద పారించారు. కాట్రెల్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌స్టో మూడు ఫోర్లుతో ఆటాక్‌ను ప్రారంభించాడు. 6, 7 ఓవర్లో కాస్త నెమ్మదిగా ఆడిన బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో బెయిర్‌స్టో రెండు సిక్సులు, ఫోర్ బాది మళ్ళీ టచ్‌లోకి వచ్చాడు.  పంజాబ్‌పై తనకు ఉన్న రికార్డును మరోసారి కొనసాగించారు వార్నర్. వరుసగా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 2015 నుంచి 2020 వరకు కింగ్స్‌పై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీలు చేశాడు.  ఆరంభంలో తేలిపోయిన పంజాబ్ బౌలర్లు.. చివరలో పుంజుకున్నారు. వార్నర్,బెయిర్‌స్టోను వెంటవెంటనే ఔట్ చేశారు స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టి రన్స్‌ను కాస్త కట్టిడిచేయగలిగారు.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Dubai, IPL 2020, Kings XI Punjab, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు