హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020 Live Score, SRH vs KXIP: దుమ్మురేపిన సన్‌రైజర్స్ ఓపెనర్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే!

IPL 2020 Live Score, SRH vs KXIP: దుమ్మురేపిన సన్‌రైజర్స్ ఓపెనర్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే!

SRH OPENERS

SRH OPENERS


  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు  జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్‌కు 202 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది.  ఓపెనర్స్ డెవిడ్ వార్నర్ 45 బంతుల్లో 52 పరుగులు సాధించగా బెయిర్‌స్టో 55 బంతుల్లో 97 పరుగులతో దాటిగా ఆడారు.  పంజాబ్‌పై తనకు ఉన్న రికార్డును మరోసారి కొనసాగించారు వార్నర్. వరుసగా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 2015 నుంచి 2020 వరకు కింగ్స్‌పై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీలు చేశాడు.

  ఈ మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ చేసిన మరో ఓపెనర్ బెయిర్‌స్టో నాలుగో ఓవర్ నుంచే రెచ్చిపోయాడు. కాట్రెల్‌ వేసిన ఆ ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి పంజాబ్‌కు సిగ్నల్‌కు పంపాడు. 6, 7 ఓవర్లో స్కోర్ కాస్త నెమ్మదించిన ఆ తర్వాత రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో రెండు సిక్సులు, ఫోర్ కొట్టి బెయిర్‌స్టో మళ్ళీ టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడి. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడి సన్‌రైజర్స్‌ స్కోర్ పరుగులు పెట్టించాడు.


  కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వావ్ అనిపించాడు. తొలి వికెట్‌కు 160పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఆరోసారి. 160 పరుగులు వరకు ఒక్క వికెట్ కూడా సాదించని పంజాబ్ ఆ తర్వాత వరుసుగా వికెట్లు తీసి సన్‌రైజర్స్ షాక్ ఇచ్చింది. చివరకు  నిర్ణీత 20  ఓవర్లలో  ఎస్ఆర్‌హెచ్  201 పరుగులు చేసింది.  పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు.

  అంతకుముందు టాస్ గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఆరో స్థానంలో ఉండగా,చివరి స్థానంలో పంజాబ్‌ ఉంది. హైదరాబాద్‌, పంజాబ్‌ ఇప్పటి వరకూ 14సార్లు తలపడగా... అందులో ఎస్‌ఆర్‌హెచ్ 10 మ్యాచ్‌లు గెలవగా పంజాబ్‌ నాలుగింట్లో గెలుపొందింది. ఈ ఐపీఎల్ 2020లో రెండు జట్లు ఐదు మ్యాచుల్లో తలపడగా మూడింట్లో హైదరాబాద్‌, రెండింట్లో పంజాబ్‌ గెలిచాయి.x`

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Dubai, IPL 2020, Kings XI Punjab, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు