SRH vs KKR, IPL 2020 Live Score: టాస్ గెలిచిన వార్నర్.. జట్లలో మార్పులు ఇవే

డేవిడ్ వార్నర్, ఇయాన్ మోర్గాన్ (Image:Twitter)

IPL 2020 Live Score, Sun risers hyderabad vs Kolkata knight riders:కోల్‌కతా టీమ్‌ గ్రీన్, ప్రసిద్ధ్ స్థానంలో కుల్దీప్ యాదవ్, లాకీ ఫర్గూసన్‌ను జట్టులోకి తీసుకుంది. హైదరాబాద్ టీమ్ ఖలీల్‌ స్థానంలో బాసిల్ థంపిని జట్టులోకి తీసుకుంది.

  • Share this:
    SRH vs KKR, IPL 2020 Live Score: ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా 35వ మ్యాచ్ అబుదాబిలో జరుగుతోంది. షేక్ జాయెద్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడుతున్నాయి. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు చెరో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నారు. కోల్‌కతా టీమ్‌ గ్రీన్, ప్రసిద్ధ్ స్థానంలో కుల్దీప్ యాదవ్, లాకీ ఫర్గూసన్‌ను జట్టులోకి తీసుకుంది. హైదరాబాద్ టీమ్ ఖలీల్‌ స్థానంలో బాసిల్ థంపి, నదీమ్ స్థానంలో మళ్ల సమద్‌ని జట్టులోకి తీసుకుంది.


    జట్ల వివరాలు:

    Sunrisers Hyderabad (Playing XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, బాసిల్ థంపి.

    Kolkata Knight Riders (Playing XI): రాహుల్ త్రిపాఠి, శుభమాన్ గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి


    ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 18 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. హైదరాబాద్ కేవలం ఏడింటిలో గెలుపొందింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓసారి హైదరాబాద్, కోల్‌కతా జట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 26న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతాపై ప్రతీకారం తీర్చుకోవాలని వార్నర్ భావిస్తోంది. మరోసారి హైదరాబాద్‌ను ఓడించాలని కేకేఆర్ కూడా పట్టుదలతో ఉంది.

    కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టోర్నీలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ సేన.. మూడు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు సాధించింది. మరో ఐదింట పరాజయం పాలయింది. కేకేఆర్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి.. 4 గెలిచింది. 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. ప్రస్తుతం కేకేఆర్‌కు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
    Published by:Shiva Kumar Addula
    First published: