SRH vs KKR, IPL 2020: మ్యాచ్ టై.. అబుదాబిలో నరాలు తెగే ఉత్కంఠ

డేవిడ్ వార్నర్ (Image:IPL)

IPL 2020: 164 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో ఓవర్లలో చేధించలేకపోయింది హైదరాబాద్. 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 163 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది.

  • Share this:
    SRH vs KKR, IPL 2020 Live Score: అబుదాబిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్, కోల్‌కతా జట్లు హోరాహోరీగా తలపడడంతో.. మ్యాచ్ టై అయింది. 164 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో ఓవర్లలో చేధించలేకపోయింది హైదరాబాద్. 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 163 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. దాంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌కు వెళ్లారు. ఈ టోర్నీలో మ్యాచ్‌ టై కావడం ఇది మూడోసారి. కాగా, హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్ వార్నర్ 47, జానీ బెయిర్‌ స్టో 36, కేన్ విలియమ్సన్ 29, డేవిడ్ వార్నర్ 28, అబ్దుల్ సమద్ 23 రాణించారు. ప్రియం గార్గ్ (4), మనీష్ పాండే (6), విజయ్ శంకర్ (10) విఫలమయ్యారు. ఆఖరులో వార్నర్‌కు సమద్ చక్కటి సహకారం ఇచ్చాడు. ఐతే 19వ ఓవర్ ఆఖరి బంతికి సమద్ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. మ్యాచ్ మరింత రసవత్తరమయింది.


    ఆఖరి ఓవర్లో 18 రన్స్ కావాల్సిన సమయంలో కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మార్గాన్.. బంతిని రస్సెల్ చేతికి ఇచ్చాడు. మొదటి బంతిని రసెల్ నోబ్ వేశాడు. తర్వాతి బంతికి రషీద్ సింగిల్ కొట్టాడు. రెండు, మూడు, నాలుగు బంతులను బౌండరీకి తరలించి హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు వార్నర్. ఐతో బంతికి రెండు పరుగులు తీశారు. లాస్ట్ బాల్‌కు రెండు రన్స్ కావాల్సి ఉండగా..వార్నర్ సింగిల్ మాత్రమే తీయడంతో మ్యాచ్ టై అయింది.

    ఐపీఎల్ 2020 టోర్నీలో 35వ మ్యాచ్ అబుదాబిలో జరుగుతోంది. షేక్ జాయెద్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ 36, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 34, నితీష్ రానా 29, దినేష్ కార్తీక్ 29, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు. రస్సెల్ (9) మినహా అందరూ బాగానే ఆడారు. ఐతే ఓపెనర్లు త్రిపాఠి, శుభమాన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చినప్పికీ.. అదే జోరును కొనసాగించలేకపోయింది కేకేఆర్. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బాలిస్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: