IPL 2020: సూపర్ ఓవర్‌లో కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ.. అసలైన టీ20 మజా

కోల్‌కతా విజయం

IPL 2020: మ్యాచ్‌ టై కావడం వల్ల సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించడం ఈ టోర్నీలో ఇది మూడోసారి.

  • Share this:
    SRH vs KKR, IPL 2020 Live Score: మ్యాచ్ అంటే ఇది. అసలైన టీ20 మజా ఇదీ. బంతి బంతికీ మలుపు.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. గెలుపు అంచుల వరకు వెళ్లి హైదరాబాద్ ఓడిపోయింది. మొదట ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం నిర్ణయించారు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. 3 బంతులకే రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటయింది. మొదటి బంతికి వార్నర్ బోల్డ్ అవగా.. రెండో బంతికి సమద్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి అతడు కూడా ఔట్ అయ్యాడు. దాంతో హైదరాబాద్ జట్టు కేవలం రెండు రన్స్ మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్ ఫర్గూషన్ సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

    అనంతరం బ్యాటింగ్‌‌కు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, మోర్గాన్.. నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించారు. రషీద్ ఖాన్ వేసిన మొదటి బంతిని మోర్గాన్ బీట్ చేశాడు. రెండో బాల్‌కు సింగిల్ తీశాడు. మూడో బంతిని కార్తీక్ బీట్ చేశాడు. నాలుగో బాల్‌కు 2 రన్స్ తీయడంతో కోల్‌కతా విజయం సాధించింది. కాగా, ఈ టోర్నీలో మ్యాచ్‌ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించడం ఇది మూడోసారి. ఇంతకు ముందు ఢిల్లీ-పంజాబ్, బెంగళూరు-ముంబై మ్యాచ్‌లు కూడా టై అయ్యాయి.

    అంతకుముందు 164 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో ఓవర్లలో చేధించలేకపోయింది హైదరాబాద్. 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 163 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. దాంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌కు వెళ్లారు. ఈ టోర్నీలో మ్యాచ్‌ టై కావడం ఇది మూడోసారి. కాగా, హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్ వార్నర్ 47, జానీ బెయిర్‌ స్టో 36, కేన్ విలియమ్సన్ 29, డేవిడ్ వార్నర్ 28, అబ్దుల్ సమద్ 23 రాణించారు. ప్రియం గార్గ్ (4), మనీష్ పాండే (6), విజయ్ శంకర్ (10) విఫలమయ్యారు. ఆఖరులో వార్నర్‌కు సమద్ చక్కటి సహకారం ఇచ్చాడు. ఐతే 19వ ఓవర్ ఆఖరి బంతికి సమద్ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. మ్యాచ్ మరింత రసవత్తరమయింది.

    ఆఖరి ఓవర్లో 18 రన్స్ కావాల్సిన సమయంలో కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మార్గాన్.. బంతిని రస్సెల్ చేతికి ఇచ్చాడు. మొదటి బంతిని రసెల్ నోబ్ వేశాడు. తర్వాతి బంతికి రషీద్ సింగిల్ కొట్టాడు. రెండు, మూడు, నాలుగు బంతులను బౌండరీకి తరలించి హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు వార్నర్. ఐతో బంతికి రెండు పరుగులు తీశారు. లాస్ట్ బాల్‌కు రెండు రన్స్ కావాల్సి ఉండగా..వార్నర్ సింగిల్ మాత్రమే తీయడంతో మ్యాచ్ టై అయింది.

    మొదట.. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ 36, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 34, నితీష్ రానా 29, దినేష్ కార్తీక్ 29, రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేశారు. రస్సెల్ (9) మినహా అందరూ బాగానే ఆడారు. ఐతే ఓపెనర్లు త్రిపాఠి, శుభమాన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చినప్పిటికీ.. అదే జోరును కొనసాగించలేకపోయింది కేకేఆర్.
    హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బాసిల్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: