ఐపీఎల్ 2020

  • associate partner

SRH VS DC: రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీ ఢమాల్

ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరిసింది. ఢిల్లీపై 88 పరుగుల తేడాతో గెలిచి విజయ దుదుంభి మోగించింది.

news18-telugu
Updated: October 27, 2020, 11:24 PM IST
SRH VS DC: రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీ ఢమాల్
Sunrisers Hyderabad won match
  • Share this:
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరిసింది. ఢిల్లీపై 88 పరుగుల తేడాతో గెలిచి విజయ దుదుంభి మోగించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక అభిమానుల ఆగ్రహానికి గురైన సన్‌రైజర్స్ తిరిగి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బాట్స్‌మెన్ ఎక్కడ కూడా లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగనివ్వకుండా కట్టడి చేసింది. మెుదటి ఓవర్‌లోనే క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో ధావన్‌ షాట్‌కు యత్నించి వార్నర్‌ చేతికి చిక్కాడు.

POINTS TABLE:

SCHEDULE TIME TABLE:

నదీమ్‌ రెండో ఓవర్లో షాట్‌కు యత్నించిన స్టాయినిస్‌ (5) మళ్ళీ వార్నర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కొద్దిసేపు హిట్టింగ్ ఆడిన హెట్‌మైయర్‌ 16(13)ను రషీద్‌ఖాన్‌ తన మెుదటి ఓవర్‌లోనే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో క్రమంగా ఢిల్లీ వికెట్స్ కోల్పొతునే ఉంది. పంత్‌(36) నిలకడగా ఆడిన చివరకు సందీప్‌ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన వికెట్‌కీపర్‌ గోస్వామి చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ నిర్ణిత 19 ఓవర్లో 131 పరుగులు చేసి అలౌట్ అయింది.

ORANGE CAP:

PURPLE CAP:

అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ బ్యాటింగ్ కారణంగా 220 పరుగుల టాగ్గెట్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. వార్నర్‌( 66; 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా(87; 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్‌ పాండే(44 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌)లతో రెచ్చిపోవడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్‌ను సాధించింది. ఓపెనర్లు కెప్టెన్‌ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా వావ్ అనిపించే శభారంభాన్ని ఇచ్చారు. పవర్ ఫ్లే ఓవర్స్‌లో పది పైగా పరగులు తీస్తూ సూపర్ నాక్ ఆడారు. ‌పవర్ ఫ్లేలోనే 77/0తో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్స్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రధాన బౌలరైనా రబాడ బౌలింగ్‌లో వార్నర్‌ విధ్వంసం సృష్టించాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌‌తో ఆ ఓవర్లో 22 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో వార్నర్‌ (66) హఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బర్డ్‌బాయ్‌ స్పెషల్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు కనబడ్డాయి.

గెలిస్తేనే ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ ఇన్నింగ్స్ ఆడింది సన్‌రైజర్స్. 88 పరుగుల భారీ తేడాతో గెలుపొంది. ఈ విజయంతో ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన స్పీన్‌తో అదరగొట్టాడు. తను వేసిన నాలుగు ఓవర్లో 7 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ ఉత్సాహంతో మిగితా మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్ చేరాలని అభిమానులు అశిస్తున్నారు.
Published by: Rekulapally Saichand
First published: October 27, 2020, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading