ఐపీఎల్ 2020

  • associate partner

SRH VS DC: రఫ్పాడించిన సన్‌రైజర్స్ బాట్స్‌మెన్స్.. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు

ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రఫ్ ఆడించింది. ఓపెనర్లు కెప్టెన్‌ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా వావ్ అనిపించే శభారంభాన్ని ఇచ్చారు

news18-telugu
Updated: October 27, 2020, 9:16 PM IST
SRH VS DC: రఫ్పాడించిన సన్‌రైజర్స్ బాట్స్‌మెన్స్.. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు
IPL 2020 Sunrisers Hyderabad vs Delhi Capitals
  • Share this:
ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రఫ్ ఆడించింది. ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ బ్యాటింగ్ కారణంగా 220 పరుగుల టాగ్గెట్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది ఓపెనర్లు కెప్టెన్‌ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా వావ్ అనిపించే శభారంభాన్ని ఇచ్చారు. పవర్ ఫ్లే ఓవర్స్‌లో పది పైగా పరగులు తీస్తూ సూపర్ నాక్ ఆడారు. ‌పవర్ ఫ్లేలోనే 77/0తో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్స్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడారు.  ముఖ్యంగా  ఢిల్లీ ప్రధాన బౌలరైనా  రబాడ బౌలింగ్‌లో వార్నర్‌ విధ్వంసం సృష్టించాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌‌తో ఆ ఓవర్లో 22 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో వార్నర్‌ (66) హఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బర్డ్‌బాయ్‌ స్పెషల్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు కనబడ్డాయి.

POINTS TABLE:

SCHEDULE TIME TABLE:

పది ఓవర్లలో ఎట్టకేలకు దిల్లీకి ఊరట లభించింది. అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కాడు. వార్నర్ ఔటైనా సన్‌రైజర్స్ బ్యాటింగ్ మెరుపులు మాత్రం అగలేదు. తర్వాత సహా,పాండ్యా డాషింగ్ బ్యాటింగ్‌తో స్కోర్‌‌ను పరిగెత్తించారు. సిక్స్‌లు,ఫోర్లతో విరుచుకుపడ్డారు. నోర్జె బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన సాహా( 87; 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) శ్రేయస్ అయ్యర్‌ చేతికి చిక్కాడు. పాండ్యా(44) ,కేన్ విలియమ్సన్‌(11) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివరకు సన్‌రైజర్స్ నిర్ణత 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

ORANGE CAP:

PURPLE CAP:

అంతకుముందు టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. సన్‌రైజర్స్ టీంలో కీలక మార్పులు చేసింది. బెయిర్‌ స్టో, ప్రియం గార్గ్‌, ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో విలియమ్సన్, వృద్ధిమాన్‌ సాహా, షాబాద్‌ నదీంలను జట్టులోకి తీసుకున్నట్లు హైదరాబాద్‌ సారథి వార్నర్‌ తెలిపారు ఇప్పటివరకు రెండు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలతో దిల్లీ రెండో స్థానంలో, నాలుగు విజయాలతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో అనుహ్య ఓటమిని చవిచూసింది సన్‌రైజర్స్. దాదాపు ప్లే ఆఫ్ రేసులో నుంచి తప్పుకున్నప్పటికి.. ఇక లీగ్‌లో అదృష్టంపైనే జట్టు భవిష్యత్ అధారపడి ఉంది.ఆడబోయే మూడు మ్యాచ్‌లను హైదరాబాద్ ఖచ్చితంగా గెలవాలి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లను ఓడించాలి.
Published by: Rekulapally Saichand
First published: October 27, 2020, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading