HOME »NEWS » »ipl 2020 live score mi vs dc todays match in abudabi shikhar dhawan half century mumbai target is 163 sk

IPL 2020 Live Score MI vs DC: అబుదాబిలో ధావన్ షో.. ముంబై టార్గెట్ ఎంతంటే..

IPL 2020 Live Score MI vs DC: అబుదాబిలో ధావన్ షో.. ముంబై టార్గెట్ ఎంతంటే..
శిఖర్ ధావన్ (Image: IPL)

IPL 2020: గతంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 24 సార్లు తలపడ్డాయి. రెండు టీమ్‌లు చెరో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ టోర్నీలో ఇవాళ 27వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలోని షేక్ జయేదా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 69, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 రన్స్‌తో అదరగొట్టారు. పృథ్వీ షా 4, రహానే 15, స్టోయినిస్ 13 పరుగులకే పరిమితమయ్యారు. ఢిల్లీ టీమ్ ఫస్ట్ ఓవర్‌లోనే పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో రహానే దొరికిపోయాడు. కృనాల్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు వెళ్లాడు.

    ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 109 స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్, 130 వద్ద స్టోయినిస్ ఔట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్.. ధావన్‌కు చక్కని సహకారం ఇవ్వడంతో.. ఢిల్లీ జట్టు 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ పడగొట్టారు.



    గతంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 24 సార్లు తలపడ్డాయి. రెండు టీమ్‌లు చెరో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే రెండూ సమవుజ్జీలుగా ఉన్నాయన్న మాట..! ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టిలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయం సాధించారు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. చెన్నై, బెంగూళరు చేతిలో మాత్రమే ఓడిపోగా.. కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లపై గెలుపొందారు.

    ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క హైదరాబాద్ చేతిలో మాత్రమే ఓటమి పాలయింది. పంజాబ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు జట్లు నాలుగు గెలిచాయి. చెరో మ్యాచ్‌లో ఎడిపోయాయి. ఈ సమఉజ్జీల పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:October 11, 2020, 21:11 IST

    टॉप स्टोरीज