HOME »NEWS » »ipl 2020 live score mi vs dc todays match in abudabi delhi capitals won toss choose to bat sk

IPL 2020 Live Score MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. జట్లలో మార్పులు ఇవే

IPL 2020 Live Score MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. జట్లలో మార్పులు ఇవే
శ్రేయస్ అయ్యర్

IPL 2020: ముంబై జట్టు ఎలాంటి మార్పులు లేకుండా.. అదే టీమ్‌తో బరిలోకి దిగుతోంది. రాజస్థాన్ మాత్రం రెండు మార్పులు చేసింది. హెట్‌మెయిర్ స్థానంలో అలెక్స్ కేరే, పంత్ స్థానంలో ఆజింక్య రహానే జట్టులోకి వచ్చారు.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ టోర్నీలో ఇవాళ 27వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలోని షేక్ జయేదా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు ఎలాంటి మార్పులు లేకుండా.. అదే టీమ్‌తో బరిలోకి దిగుతోంది. రాజస్థాన్ మాత్రం రెండు మార్పులు చేసింది. హెట్‌మెయిర్ స్థానంలో అలెక్స్ కేరే, పంత్ స్థానంలో ఆజింక్య రహానే జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మకు ఇది కీలకమైన మ్యాచ్. ఐపీఎల్‌లో 150 మ్యాచ్ ఆడుతున్నాడు ఈ హిట్ మ్యాన్.





    జట్ల వివరాలు:
    Mumbai Indians (Playing XI): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.

    Delhi Capitals (Playing XI): శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్, ఆలెక్స్ కేరే (వికెట్ కీపర్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడా, అన్రిచ్ నార్జీ



    గతంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 24 సార్లు తలపడ్డాయి. రెండు టీమ్‌లు చెరో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే రెండూ సమవుజ్జీలుగా ఉన్నాయన్న మాట..! ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టిలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయం సాధించారు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. చెన్నై, బెంగూళరు చేతిలో మాత్రమే ఓడిపోగా.. కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లపై గెలుపొందారు.

    ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క హైదరాబాద్ చేతిలో మాత్రమే ఓటమి పాలయింది. పంజాబ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు జట్లు నాలుగు గెలిచాయి. చెరో మ్యాచ్‌లో ఎడిపోయాయి. ఈ సమఉజ్జీల పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:October 11, 2020, 19:04 IST

    टॉप स्टोरीज