HOME »NEWS » »ipl 2020 live score mi vs dc decock surya half centuries mumbai indians won by 5 wickets sk

IPL 2020 MI vs DC: ఢిల్లీపై ముంబై విజయం.. పాయింట్ల పట్టికలో టాప్

IPL 2020 MI vs DC: ఢిల్లీపై ముంబై విజయం.. పాయింట్ల పట్టికలో టాప్
డికాక్, సూర్యకుమార్ (Image:IPL)

ఐపీఎల్‌ 2020లో 28వ మ్యాచ్ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. రాత్రి 07.30 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

  • Share this:
    IPL 2020: ఐపీఎల్ టోర్నీ 27వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు గెలిచింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో చేధించింది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో డికాక్ (53), సూర్య కుమార్ యాదవ్ (53) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఇషాన్ కిషన్ 28 పరుగులతో మెరిశాడు. రోహిత్ శర్మ 5, హార్దిక్ పాండ్యా 0 పరుగులతో నిరాశ పరిచారు. ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ 5 ఓవర్లలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రబడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్.. డికాక్‌తో కలిసి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దాడు. స్కోర్ 77 వద్ద ఉన్నప్పుడు డికాక్ ఔటవడంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్.. సూర్య కుమార్‌కు మంచి సహకారం అందించాడు.

    ఐతే 130 పరుగుల వద్ద ముంబై వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది ముంబై. మొదట సూర్యకుమార్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బర్త్ డే బాయ్ హార్ధిక్ పాండ్యా కేవలం రెండు బంతులాడి డకౌట్ అయ్యాడు. ఇక ధాటిగా ఆడిన ఇషాన్ కూడా 18వ ఓవర్లో పెవిలియన్‌ చేరాడు. అనంతరం పొలార్డ్ (11), కృనాల్ పాండ్యా (12) నిలకడగా ఆడుతూ ముంబైని విజయ తీరాలకు చేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబడా 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మార్కస్ స్టోయినస్ తలో వికెట్ సాధించారు.



    టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 69, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 రన్స్‌తో అదరగొట్టారు. పృథ్వీ షా 4, రహానే 15, స్టోయినిస్ 13 పరుగులకే పరిమితమయ్యారు. ఢిల్లీ టీమ్ ఫస్ట్ ఓవర్‌లోనే పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో రహానే దొరికిపోయాడు. కృనాల్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు వెళ్లాడు.

    ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 109 స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్, 130 వద్ద స్టోయినిస్ ఔట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్.. ధావన్‌కు చక్కని సహకారం ఇవ్వడంతో.. ఢిల్లీ జట్టు 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌లో గెలవడంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ కాపిటల్స్ రెండో స్థానానికి పడిపోయింది. రెండు జట్లకు సమానమైన పాయింట్స్ ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా నెంబర్ వన్ ప్లేస్‌కు వెళ్లింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన.. ఐదింట గెలిచింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. చెన్నై, బెంగళూరురు చేతిలో మాత్రమే ఓడిపోగా.. కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీ జట్లపై గెలుపొందారు.

    ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలుపొందింది. హైదరాబాద్, ముంబై చేతిలో మాత్రమే ఓటమి పాలయింది. ఐపీఎల్‌ 2020లో 28వ మ్యాచ్ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. రాత్రి 07.30 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:October 11, 2020, 23:05 IST

    टॉप स्टोरीज