ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 LIVE Score, KXIP vs MI: ముంబై పేస్‌ దెబ్బకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కుదేల్‌

news18-telugu
Updated: October 1, 2020, 11:41 PM IST
IPL 2020 LIVE Score, KXIP vs MI: ముంబై  పేస్‌ దెబ్బకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కుదేల్‌
అబుదాబి: ఐపీఎల్‌-13 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ , కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తలపడనున్నాయి. రెండు జట్లు గురువారం జరుగే బిగ్ ఫైట్‌లో విజయం సాధించాలని చూస్తున్నాయి.
  • Share this:
ఐపీఎల్‌ టీ20లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్  మధ్య జరిగిన  మ్యాచ్‌లో ముంబై జట్టు 48 పరుగుల  తేడాతో  ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేధించడంలో పంజాబ్ టీం విఫలమైంది. ముంబై చేతిలో 48  పరుగుల తేడాతో చిత్తయింది. ముంబై నిర్ధేశించిన 192 పరుగుల చేధనలో ఆ జట్టు బాట్స్‌మెన్స్ ఆది నుంచే తడబడ్డారు. గత మ్యాచ్‌ల్లో దాటిగా ఆడిన ఓపెనర్లు కేఎల్ రాహుల్(17),మయాంక్ అగార్వాల్(25) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.

నికోలస్‌ పూరన్ 44 పరుగులతో షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ జేమ్స్‌ పాటిన్‌సన్  అతన్ని అవుట్‌ చేసి పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తర్వాత బాట్స్‌మెన్స్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పంజాబ్ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకొంది.. చివరకు 143 పరుగులకే పరిమితమైంది.
అంతకు ముందు మెుదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. హిట్ మ్యాన్ సూపర్ బ్యాటింగ్‌తో పంజాబ్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో రోహిత్ 70) దాటిగా ఆడి జట్టు స్కోర్‌ను పరిగెత్తించాడు. చివర్లో పొలార్డ్ (20 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 47) పరుగులు చేయగా, హార్థిక్ పాండ్యా (11 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 30 పరుగులు) ముంబైకి భారీ స్కోర్‌ను  అందించారు.
Published by: Rekulapally Saichand
First published: October 1, 2020, 11:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading